Aviation minister Ashok Gajapathi Raju blames media on match boxes comments

Aviation minister raju says media misunderstood his comments

Union aviation minister Ashok Gajapathi RajuI carry matchbox on flight, I am not frisked, Aviation minister Raju confesses carrying matchboxes on flights, Aviation minister Raju admits of carrying match boxes, |matchbox on flight|, Aviation Minister Carries Match boxes On Planes

Union aviation minister Ashok Gajapathi Raju on wednesday blames media on misunderstood his comments

‘అగ్గి’ని రాజేయకండి.. వక్రీకరించకండి... గజపతిరాజు వినతి..

Posted: 04/08/2015 07:05 PM IST
Aviation minister raju says media misunderstood his comments

తాను సరదాగా అన్న మాటలు నిజంగానే అగ్గి రాజేయడంతో నాలుక కరుచుకున్న కేంద్ర మంత్రి ఆశోకగజపతి రాజు వాటిపై వివరణ ఇచ్చుకున్నాడు. తన వ్యాఖ్యలను వక్రీకరించి.. మీడియా అనవసరంగా రాద్దాంతం చేసిందని తన అక్కస్సునంతా మీడియాపై వెళ్లగక్కాడు. తాను చేసిన చిన్న వ్యాఖ్యలను మీడియా పెద్ద రాద్దాంతం చేసిందని. తన వ్యాఖ్యల వెనకనున్న పరమార్థాన్ని గ్రహించికుండా ఇలా చేయడం సబబు కాదన్నారు. ఇప్పటికైనా మీడియా అనవసర రాద్దాంతం చేయడం మానుకోవాలని విన్నవించారు.

తాను విమానాల్లో ప్రయాణించేటప్పుడు అగ్గిపెట్టే తన వద్దనే ఉంటుందని వెల్లడించారు. తననెవరూ చెక్‌ చేయరని, అగ్గిపెట్టె తీసుకెళ్లడం తప్పేమీ కాదని, ప్రపంచంలో ఎప్పుడైనా అగ్గిపెట్టె ఉపయోగించి హైజాక్ చేసిన ఘటన జరిగిందా? అన్న అశోక్ గజపతి రాజు.. తన వ్యాఖ్యలు వెనుక పరమార్థం కేంద్ర మంత్రులను కూడా ఉపేక్షించకుండా తనిఖీలు చేయాలన్నదేనని అన్నారు. విమాన ప్రయాణికుల భద్రతపై అమెకిరా ప్రతినిధులతో చర్చించామని భద్రతకెటగిరీలో 2 నుంచి 1వ ర్యాంకు కు చేరడం శుభపరిణామం అన్నారు.

ఈ మేరకు ఢిల్లీలో విలేకరులతో మంత్రి మాట్లాడుతూ గన్నవరం ఎయిర్ పోర్టును విస్తరించాల్సిన అవసముందని, ఆ పనులు కోనసాగుతున్నాయని చెప్పారు. అవి పూర్తయ్యాక గన్నవరంలో టెక్నాలజీ, సర్వీసులు పెంచుతామన్నారు. కొత్తగూడెంలో ఎయిర్ పోర్టు కావాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదన పంపిందని, దాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఇక ఏపీ నూతన రాజధాని అమరావతిలో ఎయిర్ పోర్టుపై మాస్టర్ ప్లాన్ తరువాత నిర్ణయం తీసుకుంటామని అశోకగజపతి రాజు పేర్కోన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aviation Minister  Ashok Gajapathi Raju  

Other Articles