SIMI Terrorists Shot Dead While Handcuffed, Police Face Questions | NHRC sumoto case

Asaduddin owaisi demands probe into telangana encounter

Asaduddin Owaisi demands probe in warangal encounter, mim demands judicial probe in warangal encounter, revenge of suryapet killings, Warangal jail to a Hyderabad court, vikaruddin and gang, vikaruddin and four simi terrorists, NHRC sumoto case

MIM president and Hyderabad MP Asaduddin Owaisi demanded that the Telangana state government order a judicial probe into the alleged encounter killing of terror suspects Viqaruddin Ahmed and four others at Alair of Nalgonda district.

వరంగల్ ఎన్ కౌంటర్ పై ప్రజాసంఘాల ఆగ్రహం, ఎన్ హెఛ్ ఆర్సీ సుమోటో కేసు

Posted: 04/08/2015 11:46 AM IST
Asaduddin owaisi demands probe into telangana encounter

వరంగల్ పట్టణ శివారులో పోలీసుల ఆయుధాలు లాక్కుని పారిపోయేందుకు యత్నించిన సెమీ ఉగ్రవాదులు వికారుద్దీన్ సహా ఐదుగురిపై జరిగిన ఎన్‌కౌంటర్ ఘటన పోలీసుల ప్రతీకార హత్యలుగా మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. ఐదుగురు అండర్ ట్రయిల్ ఖైదీల ఎన్‌కౌంటర్‌ను తీవ్రంగా ఖండించారు. సూర్యాపేట ఘటనకు ప్రతీకారంగానే పోలీసులు వారిని మట్టుబెట్టారని ఆయన అరోపించారు. చట్టపరిధిని అతిక్రమించి ఐదుగురు ముస్లిం యువకులను ఎన్‌కౌంటర్ పేరుతో పోలీసులు హత్య చేశారని ఆయన ఆరోపించారు.

ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని, బూటకపు ఎన్‌కౌంటర్‌కు పాల్పడిన పోలీసు అధికారులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు ఐదుగురు ఖైదీల ఎన్‌కౌంటర్ బూటక మని ఎంబీటీ బాధ్యుడు అమ్జదుల్లా ఖాన్ అన్నారు. అండర్ ట్రయల్ ఖైదీల చేతులకు బేడీలు వుండగా వారు ఎలా పారిపోయేందుకు యత్నించారని మానవసంఘాల ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఈ ఎన్ కౌంటర్ కేసును జాతీయ మానవహక్కుల కమీషన్ సుమోటోగా కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Encounter  Revenge killings  Majlis party  Owaisi MP asaduddin  

Other Articles