shivsena party sensation on narendra modi | tobacco controversy

Shivsena party controversial comments on narendra modi

shivsena party, narendra modi news, smoking controversy, bjp government, bjp mp dilip gandhi controversy, dilip gandhi controversy news, smoking controversy, tobacco controversy, narendra modi updates

shivsena party controversial comments on narendra modi : Shivsena party controversial comments on narendra modi about tobacco controversy in their samna daily paper

‘రోడ్లు కాదు.. ముందు మీవాళ్ల నోర్లు శుభ్రంగా ఊడ్చేయ్ మోదీ!’

Posted: 04/07/2015 03:20 PM IST
Shivsena party controversial comments on narendra modi

మహారాష్ట్ర రాష్ట్రంలో శివసేన, బీజేపీ పార్టీలు మిత్రపక్షాలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే! అయితే.. ఈ రెండు పార్టీల మధ్య మిత్రబంధం అంతగా లేనట్లుగానే కనిపిస్తోంది. అప్పుడప్పుడు శివసేన పార్టీ బీజేపీ మీద విమర్శనాస్త్రాలను సంధిస్తూ వస్తోంది. ఇప్పుడు తాజాగా పొగాకు విషయంపై వివాదం చెలరేగగా.. ఈ అంశం గురించి మాట్లాడుతూ మోదీకి ఉచిత సలహా ఇచ్చింది. ‘స్వచ్ఛ భారత్ పేరిట రోడ్లు కాదు.. ముందు మీవాళ్ల నోర్లు శుభ్రం చెయ్ మోదీ’ అంటూ శివసేన పేర్కొంది.

అతి ముఖ్యమైన విషయాల్లో కూడా సొంత పార్టీ నేతలు అవాకులు, చెవాకులు పేలుతుంటే బీజేపీ, మోదీ ఏమాత్ర స్పందించకుండా ఎందుకు మౌనంగా ఉంటున్నారని శివసేన ప్రశ్నించింది. పొగాకు వాడకంపై బీజేపీ ఎంపీ దిలీప్గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో మంగళవారం శివసేన పార్టీ తన అధికారిక పత్రిక సామ్నాలో ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు ఎక్కుపెట్టింది.

రోడ్లు, వీధులపై ఉన్న చెత్త చెదారాన్ని ఊడ్చిపారేసేందుకు తాను చీపురు పట్టానని నరేంద్రమోదీ చెప్తున్నారు.. కానీ గబ్బుమాటలతో కంపుకొడుతున్న తన సొంత పార్టీ నేతల నోర్లు ఎవరు శుభ్రం చేస్తారని ప్రశ్నించింది. పొగాకు వినియోగంవల్ల క్యాన్సర్ రాదనే కొత్త విషయాన్ని ఆవిష్కరించిన ఎంపీ దిలీప్కు ఖచ్చితంగా నోబెల్ బహుమతి అందించాలని, ఆయన డాక్టర్ కాకపోయినా ఆ అవార్డు ఇవ్వాల్సిన అవసరం మనకుందని ఎద్దేవా చేసింది.

ముంబైలోని టాటా ఆస్పత్రిలో 100 మంది క్యాన్సర్ పేషేంట్లు ఉండగా వారిలో 60 నుంచి 65 మంది పొగాకు వల్ల క్యాన్సర్ బారిన పడ్డవారున్నారని చెప్పారు. పొగాకుపై వైద్యులు ఇంతగా ఆందోళన చెందుతుంటే గాంధీ మాత్రం విస్తృతంగా పొగాకు ఉత్పత్తులపై ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అంత గొప్ప ఆవిష్కరణ చేసి పొగాకును వ్యతిరేకించేవారందరి దిమ్మతిరిగిపోయేలా చేశారని హేళన చేసింది. దీనిపై ప్రధాని మోదీ స్పందిచాలని డిమాండ్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shivsena party news  narendra modi  tobacco controversy  bjp mp dilip gandhi  

Other Articles