Judge | Save | Girl | Drowning

Judge dives into lake to save 15 year old girl from drowning

haryana, judge, dives, water, girl, save, Drowning,

Justice M Jeyapaul of the Punjab and Haryana High Court dived into the Lake to save the 15-year-old girl after he noticed her drowning while he was on his routine morning walk, Sukhna Lake Police Post In-charge Mini Bhardwaj told PTI

రియల్ హీరో.. మునిగిపోతున్న అమ్మాయిని కాపాడిన జడ్జ్

Posted: 04/06/2015 04:47 PM IST
Judge dives into lake to save 15 year old girl from drowning

దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ ఇదే దేవుడి కర్తవ్యం. ప్రతి యుగంలోనూ నేను చేసేది అదే అంటూ భగవానుడు స్వయానా పలికిన మాటలు. అయితే భగవంతుడు ఏమో కానీ ఓ హైకోర్టు జడ్జి మాత్రం దీన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. నేరం చేసిన వారికి శిక్ష విధించడం అతని ఉద్యోగం.. ఎలాగూ నిజాయితీగా నికచ్చిగా చేస్తున్నారు. అయితే అలాగే ఆపదలో ఉన్న వారిని కాపాడి దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ అనే దానికి సార్థకత చేకూర్చారు జడ్జ్. సరస్సులో మునిగిపోతున్న ఓ బాలికను కాపాడడం కోసం వెనకాముందు ఆలోచించకుండా ఆ జడ్జి అందులో దూకేశారు. ఆ చిన్నారి ప్రాణాన్ని కాపాడారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది.  

పంజాబ్‌ హర్యానా హైకోర్టు న్యాయమూర్తి జైపాల్‌ రోజూ లాగే చండీఘడ్‌లోని సుఖానా సరస్సు తీరాన మార్నింగ్‌ వాక్‌ చేస్తున్నారు. అలా మార్నింగ్ వాక్ చేస్తుండగా.. హెల్ప్‌ .. హెల్ప్‌ అంటూ ఆర్తనాదం వినిపించడంతో జడ్జి అటువైపు చూశారు. ఓ 15 ఏళ్ళ అమ్మాయి నీటిలో మునిగిపోతున్న దృశ్యం ఆయన కంట పడింది. అంతే క్షణం ఆలోచించకుండా సరస్సులోకి దూకేసి ఆ అమ్మాయిని వెతకడం ప్రారంభించారు. ఆయన వెంటే ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్‌ కూడా నీటిలోకి దూకేశాడు. ఇద్దరూ కలిసి బాలిక కోసం వెదుకులాట ప్రారంభించారు. ఇంతలో నీటి అడుగుభాగానికి చేరుకున్న ఆ అమ్మాయిని చూసిన సెక్యూరిటీ అధికారి ఆమెను ఒడ్డుకు చేర్చారు. అప్పటికే ఆ బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడంతో ప్రాధమిక చికిత్స చేశారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను అక్కడి నుండి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సత్వరం చికిత్స చేయడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది.  

అనంతరం ఆ అమ్మాయి సరస్సులో పడిపోవడానికి గల కారణంపై ఆరా తీశారు. పేదరికం వల్ల చదువుకు దూరమవుతున్నాననే ఆవేదనతో ఆ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడిందని తెలిసింది. చదువులో రాణిస్తున్నప్పటికీ, తన తండ్రి పేదరికం కారణంగా ఆమె చదువుకు దూరమైంది. దీంతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు తెగించిందని తేలింది. ఆ అమ్మాయి పరిస్థితి తెలుసుకున్న జడ్జి కరిగిపోయారు. ఆమె చదువుకు ఆర్ధిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. అలా ఆమె జీవితాన్ని కాపాడి జడ్జి హీరోగా మారాడు. ఎంతటి వారైనా సహాయం కోరిన వారిని సాయం చెయ్యడం అవసరం అని జడ్జ్ గారు మాటల్లో కాకుండా చేతల్లో చూపించారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : haryana  judge  dives  water  girl  save  Drowning  

Other Articles