Governor | statements | Congress | Narasimhan

Governor sentences contraversial statements for his self

governor, narasimhan, telangana, ap, congress, statements, contraversial, leaser, rajbhavan

governor sentences contraversial statements for his self. the congress leaders went to governor narasimhan to solve problems in two telugu states. The governor sentnced that he is not free at the rajbhavan. Hovernor said that people know what i did

గవర్నర్ 'నరసింహ'న్'.. ఖాళీగా లేనంటూ క్లారిటీ

Posted: 04/06/2015 03:41 PM IST
Governor sentences contraversial statements for his self

గవర్నర్ గారికి చిర్రెత్తినట్లుంది అందుకే నేనేం ఖాళీగా కూర్చోలేదు అంటున్నారు. ఇంతకీ విషయం ఏంటీ అంటే తనను కలిసిన కాంగ్రెస్ నేతలతో గవర్నర్ నరసింహన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వార్తల్లో నిలుస్తున్నాయి. అయితే గవర్నర్ నరసింహన్ కాస్త అసహనంగా ఉన్న మాట వాస్తవం. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎంట్రీ ట్యాక్స్ వివాదానికి గవర్నరే కారణమంటూ కొన్ని రోజులుగా వార్తలు వెలువడుతున్నాయి. అంతేకాకుండా గవర్నర్ మార్పు జరుగుతుంది అని రెండు మూడు రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఏదో కోపంలో అన్నారో లేక మనసులో ఉన్న మాట అన్నారో తెలియదు కానీ గవర్నర్ తను ఏం చేస్తున్నాడో చెప్పుకొచ్చారు.

రాజ్ భవన్ లోఖాళీగా కూర్చోనని తెలంగాణ, ఏపీ ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఎంట్రీ ట్యాక్స్'పై ఏపీ కాంగ్రెస్ నేతలు గవర్నర్ ను కలిశారు. ఈ సందర్భంగా వారి మధ్య అంతర్గత సంభాషణ చోటు చేసుకుంది. రెండు రాష్ట్రాల ప్రజల సమస్యలు తనకు తెలుసునని కాంగ్రెస్ నేతలతో గవర్నర్ అన్నారు. ప్రజాసమస్యలపై మాట్లాడిన మొదటి గవర్నర్ ను తానేనని చెప్పారు. ప్రజల కోసమే ఇద్దరు ముఖ్యమంత్రులను పిలిచి మాట్లాడానని గుర్తు చేశారు. తానేం చేశానో ప్రజలకు తెలుసునని, అందరికంటే ఒక అడుగు ముందే ఆలోచిస్తానని అన్నారు. ఏం చేసినా ఆలోచించి నిజాయితీ పనిచేశానని చెప్పారు. ఒకరితో చెప్పించుకునే రానీవ్వనని గవర్నర్ పేర్కొన్నారు.

మొత్తానికి మరో వారంలో గవర్నర్ పోస్ట్ ఊస్ట్ అంటూ మీడియాతో పాటు ప్రజల్లోనూ తీవ్ర చర్చ సాగుతోంది. తెలుగు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించడంతో గవర్నర్ నరసింహన్ విఫలమవుతున్నారని కాస్త వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.  అయితే తాజాగా తెలంగాణకు మేలు చేసేలా, ఏపికి ఇబ్బంది కలిగేలా గవర్నర్ వ్యవహరించారని పుకారు. మరి ఇలా కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు గవర్నర్ నరసింహన్ కోపానికి ఎన్ని కారణాలు ఉన్నాయో. ఏది ఏమైనా తాను ఏం చేశానో ప్రజలకు తెలుసు అని రాజకీయ నాయకుడిలా ఓ డైలాగ్ విసిరారు గవర్నర్. అయినా గవర్నర్ ఏం చేసినా.. గవర్నర్ పోస్ట్ ఊడే టైం వస్తే ఊడిపోతుంది అని కూడా కొంత మంది రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : governor  narasimhan  telangana  ap  congress  statements  contraversial  leaser  rajbhavan  

Other Articles