Modi | Media | Gossip | Breaking

Modi said that gossip column of newspapers have now become breaking news

Modi, media, coverage, news, gossips, breaking, summitt

Issues which earlier did not find a place even in a gossip column of newspapers have now become breaking news, Prime Minister Narendra Modi said today while underlining that the political class is now under increased media scrutiny.

గాసిప్ లు కానివి కూడా బ్రేకింగ్ న్యూస్ అవుతున్నాయి: మోదీ

Posted: 04/06/2015 10:41 AM IST
Modi said that gossip column of newspapers have now become breaking news

ప్రధాని నరేంద్ర మోదీ గురించి అందరికి తెలుసు. మీడియాకు ఎంత ప్రధాన్యం ఇస్తారో కూడా తెలుసు. మీడియా ద్వారా ఎప్పుడు వార్తల్లో ఉండే ప్రధాని నరేంద్ర మోదీ టీవీల్లో వస్తున్న వార్తలకు సంబందించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. కనీసం గాసిప్ లు కూడా కాని విషయాలు ఏకంగా బ్రేకింగ్ న్యూస్ గా మారుతున్నాయని నరేంద్ర మోదీ మీడియాను ఉద్దేశించి అన్నారు. నిజానికి ఎప్పుడూ మీడియా ద్వారా వార్తల్లో నిలవాలనుకునే వాళ్లలో తాను ఒకడిని అని చెప్పారు. అయితే వార్తల విషయంలొ వార్తా సంస్థల్లో వచ్చిన మార్పును మోదీ విమర్శించారు.

గతంలో బ్రేకింగ్ న్యూస్ అంటే పక్కా సమాచారం తెలుసుకున్న తర్వాత కానీ వేసే వారు కాదు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది పక్క ఛానెల్ లో వస్తే చాలు దానికి నాలుగు లైన్లు కలిపి బ్రేకింగ్ న్యూస్ గా ప్రసారం చేస్తున్నారు. యాక్సిడెంట్ కేసుల్లో అయితే మరీ దారుణంగా ఉంటోంది. ఒకే యాక్సిడెంట్ లొ ఛానెల్ ఛానెల్ కు మృతుల సంఖ్య మారుతూ ఉంటుంది. ఉత్సాహంతో కొంత మంది మీడియా ప్రతినిధులు చేసే అతి కూడా ఇందుకు కారణం. మొత్తానికి కారణాలు ఏవైనా మీడియా మాత్రం కనీసం గాసిప్ లు కూడా కాని అంశాలను ఏకంగా బ్రేకింగ్ న్యూస్ గా చేస్తున్నాయని ప్రధాని మోదీ సున్నిసంతగా విమర్శించారు.

- అబినవచారి

(Source: indolink.com)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  media  coverage  news  gossips  breaking  summitt  

Other Articles