PM Modi wants India to bid for 2024 Olympics

India may bid for 2024 olympics

India may bid for 2024 Olympics, PM Modi wants India to bid for 2024 Olympics, Prime Minister Narendra Modi, International Olympic Committee president Thomas Bach , Olympic games, Narendra Modi,may bid, International Olympic Committee, 2024 Olympics

Prime Minister Narendra Modi and International Olympic Committee president Thomas Bach will meet later this month in New Delhi to discuss India's likely bid for the 2024 Olympic Games

2024 ఒలంపిక్స్ ఆతిథ్యమివ్వనున్న భారత్.. ప్రధాని ఆకాంక్ష

Posted: 04/03/2015 08:25 PM IST
India may bid for 2024 olympics

భారత్ మరో అత్యుత్తమ క్రీడల పండుగకు వేధికగా నిలవాలని భావిస్తోంది. ఇప్పటివరకు కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలకు మాత్రమే ఆతిథ్యం ఇచ్చిన భారత్.. తొలిసారిగా ఒలింపిక్స్కు కూడా ఆతిథ్యం ఇచ్చేందుకు ఆసక్తిని చూపుతోంది.. 2024లో జరిగే ఒలింపిక్ క్రీడలను మన దేశంలో నిర్వహించాలని ప్రధాని నరేంద్రమోదీ గట్టిగా నిర్ణయించుకున్నారు.. ఇందుకోసం ఇప్పటికే ప్రయత్నాలు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ దృష్టికి కూడా ఈ విషయం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ మేరకు నెలాఖరులో జర్మనీ పర్యటన చేయనున్న మోడీ.. తన పర్యటనలో భాగంగా బాచ్తో కూడా సమావేశమై దీనిపై ఆయన చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తాను ఇప్పటికే ఐఓసీ అధికారులను గత నెలలో కలిసి, 2024 ఒలింపిక్స్ విషయంలో ప్రాథమిక చర్చలు జరిపినట్లు క్రీడాశాఖ కార్యదర్శి అజిత్ శరణ్ నిర్ధారించారు. ఐఓసీ చీఫ్ బాచ్ కూడా భారత్ ఆతిథ్యం విషయాన్ని సీరియస్గానే పరిగణిస్తున్నారు. 120 కోట్ల జనాభా ఉన్న దేశాన్ని ఎలా కాదనగలం అని కూడా ఆయన అన్నట్లు తెలుస్తోంది. 2024 ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇచ్చే దేశాలు ఈ ఏడాది అక్టోబర్ లోగా దరఖాస్తు చేయాలి. వాటిలోంచి కొన్ని నగరాలను ఐఓసీ 2016 మే నాటికి షార్ట్ లిస్ట్ చేస్తుంది. 2017 జూలైలో అధికారికంగా పేరు ప్రకటిస్తారు. ఈసారి భారతదేశానికి అవకాశం వస్తే, అహ్మదాబాద్ నగరాన్ని ఇందుకు వేదికగా చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే ఈ విషయం మాత్రం ఇంకా ఖరారు కాలేదు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 2024 Olympic games  Narendra Modi  International Olympic Committee  

Other Articles