Theives opened fire at police, not maoists says DGP Anurag sharma

Men open fire at police suspected as theives not maoists

men open fire at police suspected as theives, men open fire at police are not maoists, Theives opened fire at police, uttarpradesh, bihar theives gang, Telangana DGP Anurag sharma

men open fire at police were suspected as theives gang from uttarpradesh, bihar not maoists says Telangana DGP Anurag sharma

ఘాతుకానికి పాల్పడింది వాళ్లే.. అన్నలు కాదు అనురాగ్ శర్మ

Posted: 04/02/2015 09:30 AM IST
Men open fire at police suspected as theives not maoists

నల్గొండ జిల్లాలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులపై కాల్పులకు తెగబడి ఒక కానిస్టేబుల్; హోంగార్డు మరణానికి, సిఐ సహా మరో గన్ మెన్ లను గాయపర్చిన ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలంగాణ డీజీపీ అనురాగ్‌శర్మ అన్నారు. ఇవాళ ఉదయం సూర్యపేటలోని ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన హైటెక్ బస్టాప్ లో పరిశీలించారు. పోలీసులపై ఈ ఘాతుకానికి పాల్పడింది మావోయిస్టులన్న అనుమానాలను ఆయన తోసిపుచ్చారు. ఇది ఖచ్చితంగా ఉత్తర్ ప్రదేశ్, బీహార్‌ దొంగల ముఠా గ్యాంగుల పనిగా అనుమానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

అనంతరం పోలీసు మృతుల కుటుంబాలను పరామర్శించారు. అమర పోలీసుల మృతదేహాలపై పుష్పగుచ్చాలను ఉంచి ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసుల వద్ద నుంచి అదృశ్యమైన ఆయుధం ఘటనాస్థలంలో లభించలేదని తెలిపారు. దుండుగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్లు తెలిపారు. కాల్పుల్లో చనిపోయిన కానిస్టేబుల్‌, హోంగార్డు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కానిస్టేబుల్‌కు రూ.25 లక్షలు, హోంగార్డుకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రే షియాతో పాటు కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగం ఇస్తామని, వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని డీజీపీ తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana DGP  Anurag sharma  uttarpradesh  bihar theives gang  maoists  

Other Articles