Amaravathi | Capital |Ap

Ap govt conform the name of amaravathi for new capital

ap, capital, amaravathi, chandrababu, naidu, ntr, tdp

ap govt conform the name of amaravathi for new capital . ap govt put new capital name as amaravathi. ap cm chandrababu naidu commence to amaravathi name for capital. chandrababu express his intrest on the name of amaravathi in past.

కొత్త రాజధానికి 'అమరావతి' పేరు ఖరారు

Posted: 04/01/2015 04:24 PM IST
Ap govt conform the name of amaravathi for new capital

అందరూ అనుకున్నట్లుగానే ఏపి రాజధానికి అమరావతి పేరు ఖరారైంది. కనీసం రాజధాని కూడా లేకుండా ఏర్పటైన తొలి రాష్ట్రం ఏపి రాజధానికి అమరావతి పేరును ఖరారు చేసింది.  ప్రపంచ స్థాయి నగరంగా, అత్యాధునిక హంగులతొ కూడిన తొలి రాజధానిగా చరిత్రకెక్కనున్న ఏపి కొత్త రాజధాని పేరును అందరికి సమ్మతించేలా ఉంచాలని ఏపి ప్రభుత్వం యోచిస్తోంది. చివరకు అమరావతి పేరును ఏపి కేబినెట్ ఆమోదించింది.

దాదాపు 35వేల ఎకరాల్లో నిర్మిస్తోన్న ఏపీ రాజధాని నగరాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. భారీతనంతో నిర్మిస్తున్న రాజధానికి ఘనమైన పేరును పెట్టాలన్నది చంద్రబాబు ఆలోచన. సంప్రదాయం ఉట్టిపడేలా పేరు ఉండాలని భావించి, ఇందులో భాగంగా అమరావతి పేరును చంద్రబాబు ఎక్కువగా ఆసక్తి చూపారు. మొత్తానికి అందరూ అనుకున్నట్లు అమరావతి పేరును ఏపి ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రముఖ బౌద్దారామాల్లో ఒకటిగా ప్రపంచ ఖ్యాతి గడించిన అమరావతి పేరును చంద్రబాబు  ముందు నుండి ప్రతిపాదించారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap  capital  amaravathi  chandrababu  naidu  ntr  tdp  

Other Articles