Goa | Nurse | parsekar

Goa cm parsikar contraversial statements on nurses

goa, cm, laxmikanth, parsikar, demands, nurse, ambulance

goa cm parsikar contraversial statements on nurses. goa cm laxmikanth parsikar commented on nurses who doing protest for their demands.

ఛీ..నర్సుల గురించి గోవా సిఎం అలా అంటాడా..!

Posted: 04/01/2015 11:51 AM IST
Goa cm parsikar contraversial statements on nurses

ఎండలో సమ్మె చేయొద్దు...నల్లగా అయిపోతారు.. ఆ తర్వాత  పెళ్లికొడుకు దొరకడం కష్టం... అంటూ గోవా సిఎం చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత కొంత కాలంగా గోవా నర్సులు చేస్తున్న డిమాండ్ లపై సిఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మీడియాలో హాట్ గా నిలుస్తున్నాయి. అసలే దొరికితే చాలు ప్రభుత్వంపై దాడికి సిద్దంగా ఉండే ప్రతిపక్షాలకు గోవా సిఎం మాటలు పని పెంచాయి. నర్సులనుద్దేశించి బాధ్యతారాహిత్యమైన  వ్యాఖ్యలు చేసి ముఖ్యమంత్రి  ఇబ్బందుల్లో  పడ్డారు. దీనిపై నర్సుల అసోసియేషన్, కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.  

గోవాలోని  108 అంబులెన్స్ నిర్వహణకు సంబంధించిన నర్సులు, కొంతమంది కార్మికులు ఈ సేవలను ప్రయివేటు సంస్థకు అప్పగించడాన్ని నిరసిస్తూ  గతకొన్ని రోజులు ఆందోళన నిర్వహిస్తున్నారు.  రిలే  నిరాహారదీక్షలు  చేస్తున్నారు. అయితే నర్సులు చేస్తున్న నిరసనలపై సిఎం నుండి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. అయితే స్పందన సంగతి ఏమో కానీ నర్సుల గురించి ఏకంగా వివాదాస్పద కామెంట్లు చేశారు. దాంతో నర్సులు ఇప్పుడు గోవా సిఎం గురించి భగ్గుమంటున్నారు. అసలు ఆయనకు నర్సుల గురించి ఏ మాత్రం ప్రేమ లేదని మండిపడుతున్నారు. అయితే భవిష్యత్తులో తమ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని నర్సుల అసోసియేషన్ ప్రకటించింది. మరి లక్ష్మీకాంత్ పర్సేకర్ వ్యాఖ్యలను సమర్థించుకుంటారో లేదా క్షమాపణలు చెబుతారో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : goa  cm  laxmikanth  parsikar  demands  nurse  ambulance  

Other Articles