Picture of 'young Mother Teresa' goes viral on social media

Picture of mother teresa goes viral

Picture of ‘Mother Teresa' goes viral, Picture of 'young Mother Teresa', picture gone viral on social media, Mother Teresa, Mother Teresa at the age of 18. mother was in her teens, Mother Teresa was raving beauty at young, mother terasa preferred to help mankind,

Well, unverified, but possible. That's the picture that has gone viral on social media today.

సోషల్ మీడియాలో ‘మధర్ ధెరెస్సా’ సంచలనం..

Posted: 03/30/2015 11:10 AM IST
Picture of mother teresa goes viral

అందమైన యువతి పక్కన మధర్ ధెరిస్సా ఫోటోను ఫెట్టారేంటని అనుకుంటున్నారా..? పై ఫోటోలో కనబడుతున్న ఇద్దరినీ ఒక్కసారి దీర్ఘంగా పరిశీలించి చూడండి. వాళ్లిద్దరు వేర్వేరు కాదు. ఇద్దరూ ఒక్కరే.. నమ్మశక్యం కలగడం లేదా..? మధర్ ధెరిస్సా యవ్వనంలో దిగిన ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ మోములోని చిరు మందహాసం.. చూపు తిప్పుకోనివ్వని బహుచక్కని రూపం, కట్టిపడేసే కళ్లు, ఎంతటి దు:ఖానైనా సరే తీరిపోయ్యేట్లు చేసే ముఖవచ్చస్సు.. తేజం.. నిజమే మధర్ ధెరిస్సానే.

అయితే నిజంగా అమెదో, కాదో తెలియదు కానీ మధర్ ధెరిస్సా సరిగ్గా 18 ఏళ్ల వయస్సులో వున్నప్పుడు దిగిన ఫోటో ఇదంటూ.. సోషల్ మీడియాలో సంచలనాత్మకంగా మారింది. అమెను యవ్వనంలో తన భహుచక్కని రూపంతో ఎందరో యువకుల మనస్సులను కొల్లగొట్టింది. అమె అందానికి కుర్రకారు అప్పట్లో ఫ్లాట్ అయ్యేవాళ్లట. అయితే మనిషి అందం శాశ్వతమైనది కాదని, మనస్సు అందం మాత్రమే శాశ్వతమైనది గ్రహించిన మధర్ ధెరిస్సా.. మానవ కోటి సేవకే అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. భారత్ లోని అందునా పశ్చిమ బెంగాల్ లో అనేక సేవాకార్యక్రమాలు నిర్వహించి.. భారీయులకు మథర్ ధెరిస్సాగా మారింది.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధ్యక్షుడు మోహన్ భగవత్ మధర్ ధెరిస్సా గురించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆమె ఇటీవలి కాలంలో వార్తల్లో నిలిచారు. మధర్ ధెరిస్సా మత మార్పిడులను ఫ్రోత్సహించారని, అదే ఉద్దేశ్యంతో పశ్చిమ బెంగాల్ లోని పేదలకు అమె సేవ చేశారని మోహన్ భగవత్ అరోపించారు. మధర్ ధెరిస్సా సేవల వెనుక పేద హిందువులను క్రైస్తవులుగా మర్చే ఉద్దేశ్యం దాగి వుందని భగవత్ వ్యాఖ్యానించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Mother Teresa  raving beauty  help mankind  social media  

Other Articles