ED | Jagan | Assets | Handover

Enforcement directorate attach more assets in the case of jaganmohanreddy

ED, jagan, enforcement directorate, CBI, assets, court

enforcement directorate attach more assets in the case of jaganmohanreddy. in the case of jagan got assets and money from illigal way, ed handover more assets of shamprasad reddy. with the value of 129 cr. assets hamdovered to ed.

జగన్ అక్రమాస్తుల కేసులో మరిన్ని ఆస్తుల జప్తు

Posted: 03/26/2015 03:34 PM IST
Enforcement directorate attach more assets in the case of jaganmohanreddy

జగన్ అక్రమాస్తుల కేసుల విషయంలో దర్యాప్తు మరింత వేగంగా సాగుతోంది. అయితే వైయస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుగా జగన్ కు కొంత మంది కార్పోరేట్ వర్గాలు ముడుపులు చెల్లించాయి. ఈ కేసులో జగన్ కొన్నాళ్లు జైలుకు కూడా వెళ్లారు. అయితే తాజాగా జగన్‌ అక్రమాస్తుల కేసులో మరికొన్ని ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. ఈ కేసులో ఇందూ ప్రాజెక్ట్‌ శ్యామ్‌ప్రసాద్‌రెడ్డికి చెందిన 129 కోట్లు విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం జిల్లా గోరంట్ల మండలంలో 8648 ఎకరాలు, మహారాష్ట్రలో 25 ఎకరాలు, హైదరాబాద్‌ మాదాపూర్‌ సమీపంలో దాదాపు 2.5 ఎకరాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
 
గత నెలలో శ్యామ్‌ప్రసాద్‌కు చెందిన 53 కోట్ల ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ ప్రైవేటు లిమిటెడ్‌, లేపాక్షి సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి భూకేటాయింపుల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ఇందులో శ్యామ్‌ప్రసాద్‌రెడ్డికి లబ్ది చేకూరడంతో జగన్‌కు సంబంధించిన సంస్థల్లో దాదాపు 250 కోట్ల ఆస్తులను పెట్టుబడులుగా పెట్టినట్లు గతంలో సీబీఐ అధికారులు చార్జిషీట్‌లో ఆరోపించారు. చార్జిషీట్‌ ఆధారంగా ఈడీ అధికారులు మరో కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. అక్రమ సంపాదన, మనీలాండరింగ్‌కు సంబంధించి ఆధారాలు సేకరించి 129 కోట్ల ఆస్తులను సీజ్‌ చేస్తున్నట్లు ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ తెలిపారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ED  jagan  enforcement directorate  CBI  assets  court  

Other Articles