rajendra prasad pannel | jayasudha pannel | maa elections

Actor uttej and shivajiraja withdrawn from rajendra prasad pannel

actor uttej, actor shivaji raja, uttej press meet, maa elections, rajendra prasad pannel, jayasudha pannel

actor uttej and shivajiraja withdrawn from rajendra prasad pannel due to some physical controversies

‘మా’ ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్ కు మొదటిదెబ్బ

Posted: 03/25/2015 03:16 PM IST
Actor uttej and shivajiraja withdrawn from rajendra prasad pannel

ఈనెల 29వ తేదీన ‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’(మా) అధ్యక్ష పదవి కోసం ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే! ఈ ఎన్నికల్లో నటకిరీటి రాజేంద్రప్రసాద్, నటి జయసుధ తలపడుతున్నారు. అయితే.. ఈ పోటీలో నుంచి తప్పుకోవాల్సిందిగా తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని జయసుధ ఇటీవలే రాజేంద్రప్రసాద్ ప్యానెల్ పై విమర్శలు చేశారు. దీంతో ఈమెకు మద్దతుగా చాలామంది నటీనటులు ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికల్లో రాజేందప్రసాద్ కి కాస్త వ్యతిరేకత ఎదురవుతోంది.

ఇదలావుండగా.. తాజాగా ఈ ఎన్నికల్లో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. అదేమిటంటే.. రాజేంద్రప్రసాద్‌ ప్యానల్‌ నుంచి ఉత్తేజ్‌, శివాజీరాజా పోటీ నుంచి తప్పుకున్నారు. రాజేంద్రప్రసాద్‌ ప్యానల్‌ నుంచి ప్రధాన కార్యదర్శిగా శివాజీరాజా, జాయింట్‌ సెక్రటరీగా ఉత్తేజ్‌ నామినేషనల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. వీరిద్దరు ఇంత సడెన్ గా ఈ ఎన్నికల నుంచి తప్పుకోవడం విశేషంగా మారింది. ఈ విషయంపై శివాజీరాజా పెదవి విప్పలేదుగానీ.. తాను మాత్రం వ్యక్తిగత కారణాల వల్లే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఉత్తేజ్‌ తెలిపారు.

పోటీ నుంచి తప్పుకున్న అనంతరం ఉత్తేజ్ ఓ వార్త చానెల్ తో మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన తన విత్ డ్రాన్ పై వివరణ ఇచ్చారు. పోటీ నుంచి తప్పుకోవడం వెనుక ఎలాంటి ఒత్తిడులు లేవని, కేవలం వ్యక్తిగత కారణాల వల్లే తాను తప్పుకున్నానని ఉత్తేజ్ స్పష్టం చేశారు. అయితే.. నామినేషన్ల సమయంలో పరిస్థితి వేరు.. ప్రస్తుతమున్న  పరిస్థితి వేరు అని చెప్పారు. ‘ఎందుకలా అనిపించింది?’ అని ప్రశ్నించగా.. ఆయన సమాధానాన్ని దాటవేశారు. తాను పోటీ నుంచి తప్పుకున్న విషయాన్ని రాజేంద్రప్రసాద్ కు తెలియజేశానని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actor uttej  rajendra prasad pannel  jayasudha pannel  maa elections  

Other Articles