In movie artist association elections manchu laxmi ali thanikellabharani elected

maa, elections, movie artist association, ali, manchu laxmi, thanekella bharani

in movie artist association elections manchu laxmi, ali, thanikellabharani elected.in the elections at movie artist association mohan babu daughter manchu laxmi prasanna elected as vice president. thanikella bharani, ali, shivaji raja also in the maa.

'మా' కార్యవర్గంలోకి మంచు లక్ష్మి, అలీ, తనికెళ్ల భరణి

Posted: 03/23/2015 10:51 AM IST
In movie artist association elections manchu laxmi ali thanikellabharani elected

తెలుగు సినీ ఇండస్ట్రీ దిక్సూచిగా భావించే మా లొ పదవుల పందేరం సాగుతోంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఉపాధ్యక్షులుగా శివకృష్ణ, మంచు లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మా కార్యనిర్వహక ఉపాధ్యక్షుడుగా తనికెళ్ళ భరణి, మా ప్రధాన కార్యదర్శిగా శివాజీ రాజా, కార్యదర్శిగా ఆలీ ఎన్నికయ్యారు. అసోసియేషన్ కార్యనిర్వహక ఉపాధ్యక్షుడిగా ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి కూడా ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు.

ఇక అధ్యక్ష పదవికి ఓటింగ్ తప్పేలా లేదు. అధ్యక్ష పదవికి ప్రముఖ సినీ నటుడు నటకిరీటి రాజేంద్రప్రసాద్‌, సహజ నటి జయసుధ పోటీపడుతున్న విషయం తెలిసిందే. దాంతో ఈనెల 29న 'మా' అధ్యక్ష పదవికి ఎన్నిక జరగనుంది. కాగా 2013-15 దఫాకు కార్యవర్గంలోని కొన్ని ఇతర పదవులకు పోటీ జరిగినా అధ్యక్షుడిని మాత్రం ఏకగ్రీవంగానే ఎన్నుకున్నారు. గత రెండు దఫాలు మురళీమోహన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే రాజకీయాలతో బిజీగా ఉన్న మురళీమోహన్ ఈసారి మా అధ్యక్ష పదవికి దూరంగా ఉన్నారు. మరి ఈ సారి మా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికవుతారో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maa  elections  movie artist association  ali  manchu laxmi  thanekella bharani  

Other Articles