Mufti asks pakistan to control terrorists

mufti asks pakistan to control terrorists, Jammu and kashmir chief minister mufti mohammad sayeed, mufti mohammad sayeed warns pakistan to control terrorists, mufti speaks against pakistan,

Jammu and kashmir chief minister mufti mohammad sayeed warns pakistan to control terrorists

పాకిస్తాన్ పై కస్సుమన్న ముఫ్తీ.. విమర్శలపై కంటి తుడుపు

Posted: 03/22/2015 07:30 PM IST
Mufti asks pakistan to control terrorists

పాకిస్థాన్ సహకారం వల్లే తమ రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాతంగా జారిగాయని చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో విమర్శలు వెల్లివిరియడంతో.. దోరణి మార్చిన జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్లీ మహ్మద్ సయ్యాద్ పాకిస్థాన్ కు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్థాన్ తమ దేశ ఉగ్రవాదులను నియంత్రణలో పెట్టుకోవాలని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయ్యద్ హెచ్చరించారు. ఇది ముమ్మాటికీ తమ ప్రాంతంలో శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టే కుట్రేనని అన్నారు. రెండు రోజుల కిందట పోలీసు క్యాంపులపై వరుసగా పాక్ మిలిటెంట్లు దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. ఇదే విషయంపై వారు రెండు సభల్లో తీర్మానం చేసి ఏకగ్రీవంగా ఆమోదించారు. కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకొని ఇలాంటి దాడులు జరగకుండా ఉండేందుకు పాక్పై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని, దానిద్వారా తమ రాష్ట్రంలో ప్రజలకు భరోసా ఇచ్చినట్లవుతుందని చెప్పారు.

దాడులను చేసిన వారిని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఎప్పుడూ శాంతి శాంతి అనడం కాదు. నిజంగా పాక్ శాంతిని కోరుకునేదే అయితే ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ముందు ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులను నియంత్రణలోకి తీసుకురావాలని కోరారు. అదే సమయంలో, పాక్ కూడా ఉగ్రవాదుల బాధిత దేశమని తమకు తెలుసని అన్నారు. అయితే, దాని నియంత్రణ మేం ఏం చేయలేమంటూ మాట్లాడితే తాము ఈ రూపంలోనే స్పందిస్తామని, భవిష్యత్లో ఇలాంటివి జరగకుండా ఉంటాయని షరీఫ్ తమకు హామీ ఇవ్వాల్సినవసరం ఉందన్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakistan  jammu kashmir  mufti syeed  terror attacks  

Other Articles