Srilanka fermorming bad in the nuzeland

srilanka, newzeland, worldcup, dilshan, jayaverdane, sangakara

srilanka fermorming bad in the nuzeland. in world cup 2015 match srilanakan batsman prewforming bad in that match. dilshan gone dockout, sangakara, thirumanne, jayavardane out at low scores.

శ్రీలంకను కాపాడే వారెవరో..

Posted: 03/18/2015 11:08 AM IST
Srilanka fermorming bad in the nuzeland

శ్రీలంక ఆటగాళ్లు గత మ్యాచుల్లో రెచ్చిపోయి, అంచనాలను పెంచారు. ఇప్పటి వరకు ఉన్న అంచనాలను ఒక్కసారిగా నీరుగారుస్తూ, ఉసూరు మంటూ ఆడుతున్నారు శ్రీలంక ఆటగాళ్లు. బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక ఆటగాళ్లు బంతిని బౌండరీ దాటిస్తారని అనుకుంటే, బ్యాటుతో ఫెవిలియన్ బాట పడుతున్నారు. వరల్డ్ కప్ లో భాగంగా ఆడుతున్న సౌతాఫ్రికా, శ్రీలంక మ్యాచ్ పై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నా, శ్రీలంక బ్యాటింగ్ మాత్రం పేలవంగా సాగుతోంది. ఆరంభంలోనే లంక ఓపెనర్, డ్యాషింగ్ బ్యాట్స్ మాన్ దిల్షాన్ డకౌట్ అయ్యారు. దాంతో శ్రీలంక ఆటగాళ్ల మానసిక స్థైర్యం దెబ్బతింది. తరువాత వచ్చిన ఆటగాళ్లు క్రేజ్ లో నిలవలేక లేతులెత్తుతున్నారు.

దిల్షాన్ తరువాత మరో స్టార్ బ్యాట్స్ మన్ సంగక్కర అందరిని నిరాశపరిచారు. అసలే స్కోర్ లేక విలవిలలాడుతున్న లంకకు సంగక్కర మరింత నష్టాన్ని కలిగించేలా ఆడారు. అసలు టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడా అనే అనుమానం కలిగేంతగా సంగక్కర ఆడటం అభిమానులకు నిరాశకలిగించింది. లాహిరు తిరిమన్నే,  జయవర్దనే ఒకరి తరువాత ఒకరు ఫెవిలియన్ బాట పట్టారు. మొత్తానికి సఫారీట జట్టు శ్రీలంక ఆటగాళ్లను కట్టడి చేస్తూ మంచి దూకుడు మీదుంది. అయితే మ్యాచ్ లో కీలకంగా ఉన్న మరో  మూడు వికెట్లు పోతే, శ్రీలంక ఓడిపోవడం ఖాయం అన్నట్లున్నాయి పరిస్థితులు. మరి శ్రీలంకను ఆదుకునే వారెవరో చూడాలి. 27.2 ఓవర్లలో 4 వికెట్లను కోల్పొయి 97 పరుగులను చేసింది శ్రీలంక.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : srilanka  newzeland  worldcup  dilshan  jayaverdane  sangakara  

Other Articles