South african doctors perform worlds first penis transplant

south african doctors perform worlds first penis transplant, world's first successful penis transplant, south african doctors, penis transplant, penis transplant part of a pilot study, Tygerberg Hospital in Cape Town, University of Stellenbosch, Andre van der Merwe head of the university's urology unit, first penis transplantation

south african doctors perform worlds first penis transplant, world's first successful penis transplant, south african doctors, penis transplant, penis transplant part of a pilot study, Tygerberg Hospital in Cape Town, University of Stellenbosch, Andre van der Merwe head of the university's urology unit, first penis transplantation

ఆ మార్పిడితో చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా..!

Posted: 03/14/2015 08:36 PM IST
South african doctors perform worlds first penis transplant


మగాడు. కానీ మగతనం లేదు. కాదు కాదు మగతనం వుంది కానీ మర్మాంగమే లేదు. ఇప్పుడెలా అని బాధపడే అనేక మంది మహ్మదీయ యువకుల మాదిరిగానే ఆ యువకుడు నిశ్చేష్టుడై వున్నాడు. యువకుడి అవేదనను అర్థం చేసుకుని మర్మాంగాన్ని (పురుసాంగం) అమర్చి దక్షిణాఫ్రికా వైద్యులు చరత్ర సృష్టించారు. వైద్య చరిత్రలో మరో మైలురాయిని చేరుకున్నారు  ఇన్నాళ్లు ఎవరూ చేయని సాహసానికి ఒడిగట్టి విజేయులైయ్యారు. మొట్టమొదటిసారి పురుషాంగం ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించారు. తొమ్మిది గంటపాటు నిర్వహించిన ఈ అరుదైన ఆపరేషన్ ద్వారా అంగాన్ని కోల్పోయిన 21 ఏళ్ల యువకుడికి తిరిగి దానిని ప్రసాదించగలిగారు.

యూనివర్సిటీ ఆఫ్ స్టెల్లెన్బోస్చ్ ప్రొఫెసర్ల సహకారంతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు కేప్టౌన్లోని టైగర్బర్గ్ ఆస్పత్రి వైద్యులు శుక్రవారం మీడియాకు తెలిపారు. మత మార్పిడిలో భాగంగా సున్తీ చేయించుకున్న ఓ యువకుడు (పేరు చెప్పలేదు) కొద్ది రోజుల తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. సున్తీ సమయంలో సరైన జాగ్రత్తలు పాటించని కారణంగా ఇన్ఫెక్షన్ సోకడంతో వైద్యులు అతని పురుషాంగాన్ని తొలిగించారు. మూడేళ్ల నిరీక్షణ తర్వాత కేప్టౌన్ వైద్యుల ప్రకటన ఆ యువకుడికి కొత్త ఆశలు రేకెత్తించింది..

అనారోగ్యంతో మరణానికి చేరువైన ఓ వ్యక్తి అవయవ దానం చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో అతని అంగాన్ని సదరు యువకుడికి అమర్చేందుకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. ఏ తేదీన ఆపరేషన్ నిర్వహించిందీ వెల్లడించనప్పటికీ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని, ప్రస్తుతం ఆ యువకుడు కోలుకుంటున్నాడని టైగర్స్ బర్గ్ ఆసుపత్రి ప్రధాన వైద్యుడు ఆండ్రూ వాన్డెర్ మెర్వే చెప్పారు. సున్తీ సమయంలో అజాగ్రత్తల కారణంగా ఆఫ్రికాలో ఏటా వందలమంది యువకులు అంగాన్ని కోల్పోతున్నారని పేర్కొన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : world's first penis transplant  south africa doctors  cape town  

Other Articles