Honey bees attacked at gajwal cm helepad

honey bees attacked at gajwal cm helepad, honey bees attacked at medak cm helepad, honey bees attacked in telangana, honey bees attacked medak district officials, honey bees attacked medak district collector, honey bees attacked medak district TRS party cadre, honey bees attacked medak MP, honey bees attacked MP kotha prabhakar reddy, honey bees attacked medak district collector rahul bojja,

honey bees attacked Medak district officials and party cadre at gajwal cm helepad

తేనెటీగల దాడి, పరుగులు తీసిన పార్టీ శ్రేణులు

Posted: 03/12/2015 08:07 PM IST
Honey bees attacked at gajwal cm helepad

తేనటీగలు వాటి డిమాండ్ల అములు కోసం.. ముఖ్యమంత్రిని కలసి వినతిపత్రం ఇద్దామనుకుని ఆత్రంగా ఉన్నాయి. మిషన్ కాకతీయలో భాగంగా మెదక్ జిల్లాలోని గజ్వేల్ కు సీఎం కేసీఆర్ వస్తున్నారన్న సమాచారం అందుకున్నాయో ఏమో తెలియదు కానీ.. తీరా అక్కడికి వెళ్లాయి. నలుగురిలో నారాయణ అన్న మాదిరిగా కాకుండా సీఎం హెలిఫ్యాడ్ దిగి దిగగానే వినతిపత్రం ఇద్దమనుకున్నాయి. అంతలో అక్కడికి రయ్య్ మంటూ కార్లు వచ్చేసరికి ముఖ్యమంత్రి వచ్చాయనుకుని వెళ్లాయి. అయితే అక్కడికి ముఖ్యమంత్రి రాలేదని తెలుసుకుని నిరాశ, నిసృహకు గురైన తేనెటీగలు అక్కడున్న అధికారులు, పార్టీ శ్రేణులపై వాటి ప్రభావాన్ని చూపాయి. దీంతో సీఎం హెలీప్యాడ్ ప్రాంగణం వద్దకు చేరుకుని స్వాగతం పలుకుదాముకున్న అధికారులు పార్టీశ్రేణులు పరుగులు తీశారు.

తేనెటీగల దాడిలో ఆ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జాతో సహా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, పోలీసులకు గాయాలుయినట్టు తెలిసింది. గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న అధికారులంతా హెలీప్యాడ్ వద్ద సీఎం రాక కోసం ఎదురుచూస్తున్న సమయంలో తేనెటీగలు దాడి చేశాయి. దాంతో అధికారులు, ప్రజాప్రతినిధులంతా పరుగులు పెట్టారు. తేనెటీగల బారినుంచి తప్పుంచుకునేందుకు ప్రయత్నాల్లో గోనె సంచుల్లోనూ, కూర్చీలను అడ్డుపెట్టుకున్నారు. తేనెటీగల దాడితో అధికారులంతా సీఎం హెలీప్యాడ్ ప్రాంగణాన్ని వదిలివెళ్లారు.  ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : honey bees  attacked  gajwal  cm helepad  

Other Articles