Cbi court summons manmohan singh as accused in coal scam

coal sam, manmohan, cbi, upa, coal allocation, kumaramangalam birla, parekh, sukhender

CBI court summons Manmohan Singh as accused in Coal Scam: The special CBI court hearing the coal block allocation case, Wednesday, summoned former prime minister Manmohan Singh as an accused and asked him to appear before it on April 8.

మన్మోహన్ కు కోర్టు సమన్లు

Posted: 03/11/2015 11:11 AM IST
Cbi court summons manmohan singh as accused in coal scam

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సీబీఐ స్పెషల్ కోర్టు సమన్లు జారీ చేసింది. బొగ్గు గనుల కేటాయింపులకు సంబందించిన కేసులో ఏప్రిల్ 8వ తేది కోర్టు ముందు హాజరు కావాలని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. కోల్ కేటాయింపులకు సంబంధించి మన్మోహన్‌ సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్న కాలంలో బొగ్గు మంత్రిత్వశాఖ కూడా ఆయన పర్యవేక్షణలోనే ఉంది. ఈ కేసులో వివిధ కోణాలపై అప్పటి బొగ్గు శాఖా బాధ్యతలకు కూడా కలిగిన మన్మోహన్‌సింగ్ ను విచారించకుండా కేసులో తుది నివేదికను అంగీకరించబోమని ప్రత్యేక న్యాయమూర్తి భరత్‌పరాశర్ గతంలోనే తెలిపారు. అయితే తాజాగా మన్మోహన్ తో పాటు పారిశ్రామిక వేత్త కుమార మంగళం బిర్లా,  మాజీ కోల్  సెక్రటరీ పీసీ  పరాక్, సుఖేదంర్ అమితాబ్, భట్టాచార్య లకు సీబీఐ స్పెషల్ కోర్టు  సమన్లు జారీ చేసింది.

అయితే పిసి పరేఖ్ సమన్లను పూర్తిగా చదివిన తరువత సమాధనం ఇస్తానని తెలిపారు. కాగా మన్మోహన్ సింగ్ ను ఇదే కేసులో సిబిఐ జనవరి 18న విచారించి, మరోసారి తాజాగా కోర్టు సమన్లు జారీ చెయ్యడం వార్తలకెక్కింది. బొగ్గు గనులను తనకు కేటాయించాలని కుమార మంగళం బిర్లా రాసిన రెండు లేఖలపై మన్మోహన్ సింగ్ ను సిబిఐ ప్రశ్నించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే యుపిఎ హయాంలో జరిగిన అవినీతిని అప్పటి ప్రభుత్వం బయటకు రాకుండా చూసిందని, కానీ ఇప్పుడు అన్ని నిజాలు బయటకు వస్తున్నాయని బిజెపి నాయకులు అంటున్నారు. అయితే ఈ కేసు వ్యవహారం నుండి మన్మోహన్ ఎప్పుడు బయటపడతారో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coal sam  manmohan  cbi  upa  coal allocation  kumaramangalam birla  parekh  sukhender  

Other Articles