Karnataka governor vajubhai vala walked while national anthem singing

karnataka governor, vajubhai vala, national anthem, rajbhavan,

karnataka governor vajubhai vala walked while national anthem singing. Karnataka governor Vajubhai Vala on Tuesday walked off the podium when the national anthem was being played at an official function at Raj Bhavan, landing him in a controversy.

జాతీయ గీతాన్ని అవమానించిన గవర్నర్

Posted: 03/11/2015 10:21 AM IST
Karnataka governor vajubhai vala walked while national anthem singing

రాజ్యాంగ ద్వారా నియమించబడి, రాజ్యాంగాన్ని పాటించాల్సిన వ్యక్తులు కూడా కొన్ని సార్లు వాటిని తుంగలో తొక్కుతున్నారు. భారతదేశంలోని ప్రతి భారతీయుడు జాతీయగీతాన్ని, జాతీయ జెండాను గౌరవించాలి. జాతీయ జెండాను కానీ జాతీయ గీతాన్ని కానీ అవమానించేలా భారతదేశంలోని ఏ ఒక్క వ్యక్తి ప్రవర్తించరాదు. కానీ రాజ్యాంగాన్ని అమలు చేసే కీలక బాధ్యతల్లో ఉన్న ఓ రాష్ట్ర గవర్నర్ జాతీయ గీతాన్ని అవమానించడం ఇప్పుడు వార్తలకెక్కింది.

కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా రాజ్ భవన్ లో జాతీయగీతాన్ని అవమానించేలా ప్రవర్తించారు. జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ కర్ణాటక రాష్ట్ర హైకోర్ట్ న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారోత్సవానికి గవర్నర్ వాజుభాయ్ వాలా హాజరయ్యారు. అయితే ప్రమాణ స్వీకారం తరువాత జాతీయ గీతాన్ని ఆలపించడం ఆనవాయితీ. కానీ జాతీయగీతాన్ని అందరు పాడుతుండగా మధ్యలోనే గవర్నర్ సభ నుండి వెళ్లిపోయారు. దాంతో అక్కడే ఉన్న కర్ణాటక హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి డి.హెచ్.వాఘేలా తదితరులు ఆశ్చర్యపోయారు. గవర్నర్ తప్ప మిగిలిన వారంతా జాతీయగీతాన్ని గౌరవిస్తు లేచి, నిలిచి పాడుతుండగా గవర్నర్ వెళ్లి పోవడం తీవ్రం సంచలనానికి కారణమైంది. రాజ్ భవన్ లో జరిగిన ఘటనను అన్ని టీవి ఛానళ్లు ప్రసారం చేశాయి. దాంతో సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. రాజ్యాంగబద్ద పదవిలో ఉండి, ఓ గవర్నర్ ఇలా ప్రవర్తించడం ఏంటని నిరసన వ్యక్తమవుతోంది. అయినా ఇప్పటి వరకు కూడా రాజ్ భవన్ నుండి ఎలాంటి సమాధానం రాకపోవడం గమనార్హం.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : karnataka governor  vajubhai vala  national anthem  rajbhavan  

Other Articles