Today telanagana govt will produce new budget in assembly

telangana, budget, eetela rajender, kadium, kcr, watergrid, kakatiya

today telanagana govt will produce new budget in assembly. telanagana govt to plan for 1,10,000cr budget for the economic year 2015-16. in this budget mission kaktiya, harithaharam, watergrid have majority funds may be.

నేడే తెలంగాణ బడ్జెట్

Posted: 03/11/2015 08:54 AM IST
Today telanagana govt will produce new budget in assembly

2015-16 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం లక్షా పదివేల కోట్ల రూపాయల మేరకు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ర్టానికి ఇదే తొలి పూర్తిస్థాయి బడ్జెట్ కావడం విశేషం. కొత్త వార్షిక బడ్జెట్‌లో ప్రణాళిక పద్దుకింద రూ.52వేల కోట్లు, ప్రణాళికేతర పద్దుకింద రూ.58వేల కోట్లు పొందుపరిచినట్లు సమాచారం. సచివాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో పది నెలల కాలానికి లక్షా 637 కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. కేంద్రం పన్నుల వాటా కింద వచ్చే నిధులు, రాష్ట్ర ఆదాయమార్గాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను దాదాపు లక్షా పది వేల కోట్లతో రూపొందించినట్లు తెలుస్తున్నది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలతోపాటు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసేలా బడ్జెట్ కేటాయింపులుండబోతున్నాయని సమాచారం.  అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, మండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

 ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ, పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్‌ల నిర్మాణం, వృద్ధులు, వికలాంగులు, వితంతులకు పింఛన్లు, దళితులకు మూడెకరాల భూమి కొనుగోలు పథకం, విద్యుత్, కేజీ టు పీజీ, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, సాగునీటిప్రాజెక్టుల పూర్తికి అధిక నిధులు కేటాయిస్తున్నారని తెలుస్తున్నది. హరితహారంకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారని సమాచారం. వీటితోపాటు సంక్షేమ పథకాలకు కొత్త బడ్జెట్‌లో ప్రణాళికేతర వ్యయం రూ.58వేల కోట్లకు పైగా ఉండే అవకాశం ఉంది. ఇందులో మిషన్ కాకతీయకు రూ.6,500కోట్లు, వాటర్‌గ్రిడ్‌కు రూ.5వేల కోట్లు, విద్యుత్‌రంగంలో ఉచిత విద్యుత్తు, జెన్‌కో ప్రాజెక్టుల్లో ప్రభుత్వ వాటాలకోసం రూ.7,500కోట్లు, డబల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణానికి రూ.4,400కోట్లు, కొత్త సచివాలయం నిర్మాణానికి రూ.200కోట్లు, గ్రామీణ ప్రాంతాలతోపాటు జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.3,500 కేటాయించే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2014-15) ప్రభుత్వం రూ.1,00,637 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రణాళిక వ్యయంకింద రూ.48,648.47 కోట్లు, ప్రణాళికేతర వ్యయంకింద రూ.51,989.4 కోట్లు ఉన్నాయి. ప్రస్తుత బడ్జెట్ లక్ష కోట్లకు పైగా ఉంటే అప్పులు రూ.18వేల కోట్లుకు మించి ఉన్నాయి. అయితే కొత్త బడ్జెట్‌లో ప్రణాళిక వ్యయంలో కేవలం కొన్ని మార్పులకే పరిమితం చేస్తూ ప్రణాళికేతర వ్యయం కింద ఎక్కువ నిధులు కేటాయించనున్నారని సమాచారం.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  budget  eetela rajender  kadium  kcr  watergrid  kakatiya  

Other Articles