The government ready to make changes in land acquisition bill

land acquisition, The government, Venkaiah Naidu, pm modi, parliament

The government Monday indicated it is willing to make some changes to the bill amending the land acquisition Act, and that it is open to new ideas and suggestions. As the opposition attacked the government after it moved the bill in the Lok Sabha, Parliamentary Affairs Minister M Venkaiah Naidu intervened: Government is willing to go in for amendments in the bill in the larger interests of the community and the country.

ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్న ప్రతిపక్షాలు

Posted: 03/10/2015 09:05 AM IST
The government ready to make changes in land acquisition bill

ఎన్డీయే ప్రభుత్వం తీసుకు రావాలనుకున్న భూసేకరణ చట్టానికి ఆది నుండి అడ్డంకులు ఎదురవుతున్నాయి. చివరకు భారతీయజనతాపార్టీ మిత్ర పక్షాలు కూడా బిల్లులో మార్పులు తీసుకు రావాలని, లేనిపక్షంలో మద్దతిచ్చేది లేదని తేల్చిపడేశాయి. కాంగ్రెస్, తృషముల్ కాంగ్రెస్, ఎన్సీపి, సమాజ్ వాది పార్టీ, బిఎస్పీ,  టిఆర్ఎస్ ఇలా చాలా పార్టీలు ప్రభుత్వం తెస్తున్న భూసేకరణ బిల్లులో మార్పులు తేవాలని పట్టుబట్టాయి. అయితే కేవలం కార్పోరేట్ వర్గాలకు మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా ప్రస్తుత బిల్లు ఉందని, దాన్ని మార్చాలనిఅన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఎన్డీయే భాగస్వామి శివసేన కూడా ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తోంది. మంగళవారం ఈ బిల్లు లోక్‌సభలో ఓటింగ్‌కు రానున్న నేపథ్యంలో శివసేన కూడా బిల్లులో సవరణలను సూచించింది.

అయితే కొన్ని సవరణలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు సంకేతాలిచ్చారు. ప్రభుత్వం మొత్తం ఆరు సవరణలను ఈ బిల్లుకు ప్రతిపాదించే అవకాశం ఉందని తెలుస్తోంది. మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందితే గ్రామాలు ప్రగతి పథంలో పయనిస్తాయని వెంకయ్య చెప్పారు. సామాజిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు భూసేకరణలో మినహాయింపులు కల్పించే విషయం పరిశీలిస్తామని ఆయన చెప్పారు. ఐదేళ్లలో రైల్వేలైన్ల నిర్మాణం పూర్తిచేయాలన్నా భూ సేకరణ చట్టం అవసరమని ఆయన చెప్పారు. ఢిల్లీ-ముంబై కారిడార్‌, విశాఖ-చెన్నై కారిడార్లకు భూమి అవసరమని, ఛత్తీ్‌సగఢ్‌, ఆంధ్రప్రదేశ్‌ల్లో కొత్త రాజధానులకు భూమి అవసరమని గుర్తుచేశారు. భూసేకరణపై ఆర్డినెన్స్‌ను దాదాపు అన్ని రాషా్ట్రల అభిప్రాయాలకు అనుగుణంగానే జారీ చేశామని వివరించారు. భూసేకరణకు తగిన పరిహారం ఇవ్వడంలో రాజీపడేది లేదని, కొత్త బిల్లులో మరో 13 కేటగిరీలకు మినహాయింపునిచ్చి రైతులకు అధిక ప్రయోజనం చేకూర్చామని ఆయన చెప్పారు. అయితే.. తాము సూచించిన సవరణలు చేయకుంటే బిల్లుకు వ్యతిరేకంగా ఓటు చేయాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. కాగా, భూసేకరణసహా పలు కీలక బిల్లులకు పార్లమెంటులో ఆమోదం పొందాల్సి ఉండటంతో ఉభయసభలో తమ సభ్యులంతా తప్పనిసరిగా ఈ వారమంతా సమావేశాలకు హాజరై తీరాలని బీజేపీ విప్‌ జారీచేసింది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : land acquisition  The government  Venkaiah Naidu  pm modi  parliament  

Other Articles