Pm drops maldives from indian ocean tour

Modi to visit Seychelles, Mauritius, Sri Lanka, narendra modi foreign tour list, narendra modi foreign visits schedule, foreign media on narendra modi speech, time magazine narendra modi, narendra modi visit to jnpt, narendra modi visit tickets, narendra modi visit ayodhya, narendra modi visit to russia, narendra modi latest updates, narendramodi latest news, PM narendra modi, modi's foreign tour

Prime Minister Narendra Modi has dropped from his 'four-nation Indian Ocean foray' which includes Seychelles, Sri Lanka and Mauritius.

చైనా ఆదిపత్యానికి బ్రేకులు.. మోడీ విదేశీ పర్యటన ఖరారు..

Posted: 03/07/2015 01:26 PM IST
Pm drops maldives from indian ocean tour

భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ విదేశీ పర్యటన ఖరారైంది. ఈ మేరకు భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ వెలువరించిన ప్రకటనలో పేర్కోంది. మార్చి 10 నుంచి 14వ తేదీ వరకూ మోదీ ఈ మూడు దేశాల్లోనూ పర్యటిస్తారు. హిందూ మహాసముద్రంపై చైనా అధిపత్యానికి బ్రేకుల వేసే విషయమై ప్రధానంగా చర్చింనున్నారని సమాచారం. సీషెల్స్, మారిషస్, శ్రీలంకల్లో పర్యటన నిమిత్తం ప్రధాని ఈనెల పదో తేదీన బైయలుదేరి వెళ్లనున్నారు. మార్చి 11న సీషెల్స్ పర్యటన సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు జేమ్స్ అలెక్సిస్ మైకేల్‌తో నరేంద్రమోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. సముద్రయానం, అభివృద్ధికి సహకారం అంశాలపై ఉభయులు దృష్టి సారిస్తారు.

అనంతరం మారిషస్‌కు వెళతారు. అక్కడాయన 11, 12 తేదీల్లో ప్రధాని అనిరుధ్ జగన్నాథ్‌తో విస్తృతంగా సమావేశమౌతారు. మారిషస్ జాతీయ దినోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. మార్చి 13, 14 తేదీల్లో శ్రీలంక పర్యటన సందర్భంగా దేశాధ్యక్షుడు మంత్రిపాల సిరిసేనతో మోదీ చర్చలు జరుపుతారు. రాజకీయ పార్టీలకు చెందిన సీనియర్ నేతలతో సమావేశమౌతారు. రాజకీయంగా అత్యున్నతస్థాయిలో పరస్పర సహకారం పెంపు, ఉభయులకు ఆసక్తి ఉన్న వివిధ అంశాలపై చర్చిస్తారు. శ్రీలంక పార్లమెంటు ప్రత్యేక సమావేశాలనుద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. శ్రీలంక అధ్యక్షుడు ఇచ్చే ప్రత్యేక విందు కార్యక్రమంలో పాల్గొంటారు.

శ్రీలంకలో నాటి అంతర్యుద్ధం సందర్భంగా అక్కడికెళ్లి అమరులైన 'భారతశాంతి పరిరక్షణ దళం'(ఐపీకేఎఫ్) సైనికుల స్మారకం వద్ద మోదీ పుష్పాగుచ్ఛాన్ని ఉంచి అంజలి ఘటిస్తారు. తమిళులు అధికంగా ఉండే జాఫ్నాలోనూ ఆయన పర్యటించవచ్చని తెలుస్తోంది. ఈ పర్యటన చోటు చేసుకుంటే...జాఫ్నాకు వెళ్లిన తొలి ప్రధానిగా నరేంద్రమోదీ ప్రత్యేకతను సాధిస్తారు. అనూరాధాపుర పర్యటన సందర్భంగా ఆయన శ్రీలంకలోని అత్యంత ప్రముఖమైన 'శ్రీ మహాబోధి'ని సందర్శిస్తారు. అంతేకాదు, భారత ఆర్థిక సహకారంతో చేపట్టిన తలైమన్నార్-మెదావచ్చియాల మధ్య రైలు సర్వీసును ప్రభాని ప్రారంభిస్తారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sushma Swaraj  Narendra Modi  Maldives  PM's visit  Indian Ocean tour  

Other Articles