High allert in assam and nagaland

nagaland, assam, mobattack, rapist, dimapur, highalert

Assam, nagaland was put on high alert today to prevent any fallout from the lynching of a rape accused in Nagaland with chief minister Tarun Gogoi condemning the incident and taking up the issue with his counterpart in Nagaland and the Centre.

నాగాలాండ్, అస్సాంలలో ఉద్రిక్తత

Posted: 03/07/2015 10:28 AM IST
High allert in assam and nagaland

నాగాలాండ్ కు చెందిన ఓ మహిళను ఫరీద్ ఖాన్ అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. అయితే ఓ వర్గానికి చెందిన మహిళ కావడంతో ఎక్కువ సంఖ్యలో జనాలు పోగయ్యారు. కస్టడీకి తరలించాలని కోర్టు తీర్పునిచ్చింది. అయితే  నిందితున్ని కఠినంగా శిక్షించాలని సుమారు నాలుగువేల మంది జైలుపై దాడికి చేశారు.  జైలు గేట్లను బద్దలుకొట్టి నిందితుడైన ఫరీద్‌ఖాన్‌ను బయటికి తీసుకొచ్చారు. నగ్నం గా వీధుల్లో ఊరేగిస్తూ నగరంలోని సిటీ టవర్ వరకూ ఈడ్చుకెళ్లారు, అక్కడే ఉన్న పది వాహనాలకు నిప్పంటించారు. కసితో ఉన్న ప్రజలు నిందితున్ని తీవ్రంగా కొట్టి చంపేశారు

ఇది కాస్తా రెండు వర్గాల  మధ్య చిచ్చు రేపింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేందుకు అవకాశమున్న నేపథ్యంలో నాగాలాండ్,అసోంలో కేంద్రం హైలర్ట్ ను ప్రకటించింది. కేంద్ర రెండు రాష్ట్రాల డిజిపిల నుండి వివరణ కోరినట్లు సమాచారం. మరో పక్క పరిస్థితులను ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేధించాలని హోంమంత్రిత్వ శాఖ నుండి ఆదేశాలు జారీ అయ్యాయి. నాగాలాండ్ యువతిపై లైంగికదాడికి పాల్పడిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన నాగా ప్రజలు ఘటనపై తీవ్రంగా స్పందించే అకాశాలున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో రెండు రాష్ర్టాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగనున్నట్టు గ్రహించిన కేంద్రహోంశాఖ భారీ భద్రతాదళాలను రంగంలోకి దింపింది. ఘటనతో నాగాలాండ్, అసోం రాష్ర్టాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : highalert  dimapur  nagaland  assam  mobattack  rapist  

Other Articles