Notification will come soon in telangana

telanagana, tpsc,gantachakrapani, kcr, unemployess, students

notification will come soon in telangana. telanagana govt trying to release new notification for jobs. from the telangana fighting unemployees are very excited on notification.

త్వరలోనే తెలంగాణలో నోటిఫికేషన్

Posted: 03/04/2015 04:32 PM IST
Notification will come soon in telangana

తెలంగాణ ఉద్యమం ముఖ్యంగా మన నీళ్లు, మన ఉద్యాగాలు అన్న నినాదంతో మొదలైంది . ఎన్నో పోరాటాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తమకు ఉద్యోగాలు వస్తాయని చాలా మంది యువకులు, విద్యార్థులు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత భారీగా నోటిఫికేషన్లు ఉంటాయని అందరూ అనుకున్నా, ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యోగ ప్రకటన రాలేదు. దాంతో ఎంతో కాలంగా ఉద్యోగాల కోసం ఎదరుచూసిన వారు నిరాశకు గురవుతున్నారు. కొత్తగా పబ్లిక్ కమీషన్ ను ఏర్పాటు చేయడం వల్ల, ఉద్యోగ ప్రకటన కాస్త ఆలస్యమవుతుందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినా, సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు త్వరలోనే శుభవార్త వింటారని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్  చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. ఎన్నో ఏండ్లుగా ఉద్యోగాల భర్తీ కోసం ఎదురుచూస్తున్న ఔత్సాహికుల కోరిక త్వరలోనే నెరవేరనుందని ఆయన తెలిపారు. నగరంలో ప్రస్తుతం ఎన్నికల నియామావళి అమల్లో ఉన్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ విభాగంలోనూ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయలేదని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు నోటిఫికేషన్ జారీచేస్తామన్నారు. మలిదశ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర అద్వితీయమని ఆయన ప్రశంసించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొన్ని విభాగాల పంపకాల్లో అభ్యంతరాలున్నా త్వరలోనే సర్దుకుంటాయని పేర్కొన్నారు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telanagana  tpsc  gantachakrapani  kcr  unemployess  students  

Other Articles