Nirbhaya s rapist speaks for the first time on india s daughter

nirbhaya, rapist, mukhesh, bbc, indian daughter, womens day,

One of the men on death row for the December 2012 gang rape and murder of a young medical student in a moving bus in Delhi, has said on camera that the woman was to be blamed and "she shouldn't have fought back."

ఎదరుతిరగకపోతే అత్యాచారం చేసి వదిలేసే వాళ్లం

Posted: 03/03/2015 08:48 AM IST
Nirbhaya s rapist speaks for the first time on india s daughter

ఆమెనే తప్పు పట్టాలి. ఆమె ఎదురుతిరిగి ఉండాల్సింది కాదు అని నిర్భయ కేసు నిందితుడు వెల్లడించాడు. ఢిల్లీలో రెండేళ్ల క్రితం నిర్భయపై కిరాతకానికి పాల్పడి, ఉరిశిక్షకు గురైన నలుగురు దోషుల్లో ఒకడైన ముఖేశ్ సింగ్ తాజాగా బీబీసీ ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘భారత కూతురు’ పేరుతో మార్చి 8న ఎన్‌డీటీవీలో రానున్న డాక్యుమెంటరీలో భాగంగా ఈ ఇంటర్వ్యూ చేశారు. ఉరిశిక్ష అమలుకానున్నా ఎలాంటి పశ్చాత్తాపం లేని ముఖేశ్  ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రేప్ జరగడానికి పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువ బాధ్యులన్నాడు. నిర్భయ ఉదంతం యాదృచ్ఛికంగా జరిగిందని, ఆమె ఎదురు తిరగకపోయి ఉంటే అత్యాచారం చేశాక మామూలుగా వదిలేసి పోయేవారన్నాడు. ఇంతకుముందు అత్యాచారం చేసి బెదిరించి వదిలేసేవారని, ఉరిశిక్ష వల్ల ఇక ముందు బాధితురాలిని చంపేస్తారన్నాడు.

ఆమెను తామేమి అనలేదని, కానీ ఆమె స్నేహితుడిని మాత్రం చితకబాదినట్లు వెల్లడించారు. నిర్భయను అత్యాచారం చేసేపుడు తాను బస్సు నడుపుతున్నట్లు .. ఆడవాల్లు ఇళ్లలో ఉంటే అత్యాచారం చెయ్యాలని ఆలోచన ఎలా వస్తుందని అతను ప్రశ్నించాడు. మగాళ్లనే అత్యాచారాలకు బాధ్యులను చెయ్యడం ఏంటని ప్రశ్నించాడు. ఒకచేత్తో చెప్పట్లు కొట్టలేమని అన్నాడు. అబ్బాయిలు, అమ్మాయిలు పబ్బులు,డిస్కోలు తిరిగితే పర్లేదా అని ప్రశ్నించాడు. ఆడవారు, మగవారు సమానమైనపుడు ఉరిశిక్ష ఎందుకు అని ప్రశ్నించాడు. 2012 డిసెంబర్ 16న రాత్రి 9 గంటలకు సినిమా చూసి వస్తుంటే కామాంధులు బస్సులో అత్యాచారానికి పాల్పడటం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.  
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nirbhaya  rapist  mukhesh  bbc  indian daughter  womens day  

Other Articles