Botsa satyanarayana former pcc chief controversial comments chandrababu naidu

botsa satyanarayana news, botsa satyanarayana press meet, ap cm chandrababu naidu, chandrababu naidu news, chandrababu naidu photos, andhra pradesh govt, ap capital city

botsa satyanarayana former pcc chief controversial comments chandrababu naidu : former chief and former minister botsa satyanarayana makes controversial comments on ap cm chandrababu naidu that he doing illegal business with other country professionals.

బాబు జైలుకు వెళ్లక తప్పదు : బొత్స

Posted: 02/27/2015 04:23 PM IST
Botsa satyanarayana former pcc chief controversial comments chandrababu naidu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబునాయుడు తన శక్తిమేర ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రాన్ని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ వారు ప్రత్యేక ప్యాకేజీని కాదు కదా.. కనీస నిధులు కూడా విడుదల చేయడం లేదు. అయినప్పటికీ తాను అనుకున్నది సాధించేవరకు వదిలిపెట్టనంటూ ఆయన పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రప్రజలకు భరోసాన్నిస్తూ తమ ప్రభుత్వాన్ని నెట్టుకెళ్తున్నారు. అయితే.. ఇంతవరకు బాబు ఇచ్చిన హామీలను పూర్తి చేయకపోవడంపై కొందరు నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సీఎం బాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పాలన కొనసాగడం లేదని, కేవలం రాజకీయ వ్యాపారమే సాగుతోందంటూ ఆయన ఆరోపించారు. జపాన్, సింగపూర్ వంటి ప్రాంతాలకు వెళ్లిన చంద్రబాబు.. ఎవరెవరితో మాట్లాడారో పరిశీలిస్తే.. అసలైన నిజాలు బయటకు వస్తాయని.. అప్పుడు ఆయన జైలుకు వెళ్లక తప్పదని అన్నారు. తప్పుడు హామీలతో ప్రజలను మభ్యపెట్టి, తన ప్రయోజనాల కోసం వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని అన్నారు.

గతంలో కూడా చంద్రబాబుపై ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చాయని పేర్కొన్న ఆయన.. వాటిపై విచారణ జరగకుండా ఆయన స్టే తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. సింగపూర్ తరహాలో ఏపీ రాజధాని నిర్మాణం వుంటుందని బాబు ప్రభుత్వం పేర్కొంది కానీ.. అందులో ఏమాత్రం పారదర్శకత లేదని విమర్శించారు. బాబుపై విచారణ చేప్టటాలని, అప్పుడు ఆయన చేసిన దందాలు, వ్యాపారాలన్నీ బయటకు వస్తాయని అన్నారు. నిజాలు బయటపడినప్పుడు బాబు జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన అన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : botsa satyanarayana  chandrababu naidu  ap capital city  

Other Articles