Chandrababu should keep his promise

chandrababu should keep his promise, Andhra pradesh chief minister chanfrababu, AP CM chandrababu, chandrababu should clear his promise, mrps president manda lrishna, babu on mrps, manda lrishna madiga on chandrababu, manda lrishna madiga, mrps, N.chandrababu naidu, sc catagerization

Andhra pradesh chief minister chanfrababu should keep his promise on division says mrps president manda lrishna

బాబూ.. ఎబిసిడీలు ఎప్పుడు చెయిస్తావు..!

Posted: 02/25/2015 05:08 PM IST
Chandrababu should keep his promise

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏబీసీడీలు ఎప్పుడు చేయిస్తావని మాదిగ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణంపై చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఎస్సీ వర్గీకరణను పూర్తి చేసి తాను మాదిగలలో పెద్ద మాదిగ అనిపించుకుంటానని ప్రసంగాలు చేసిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక మారిపోయారని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణను అములు చేసే విషయమై తాను ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆయన దుయ్యబట్టారు. అధికార దర్పంతో ఎస్సీ వర్గీకరణ విషయాన్ని పూర్తిగా మరిచిపోయి మాదిగలను దారుణంగా మోసం చేశారని విమర్శించారు.

ఇప్పటికైనా చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ విషయంలో స్పష్టమైన హామీని ఇవ్వాలని లేనిపక్షంలో త్వరలో చంద్రబాబు కరీంనగర్లో నిర్వహించనున్న సభను అడ్డుకోక తప్పదని హెచ్చరించారు. మరోపక్క, మార్చి 3న చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా ఎమ్మార్పీఎస్ నిరసనలు తెలిపే సన్నాహాల్లో ఉన్నట్లు తెలిసింది. దీంతో మాదిగ కార్యకర్తలను ప్రసన్నం చేసుకునే పనిలో టీడీపీ శ్రేణులు ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నో ఆఫర్లు అందించి ప్రలోభాలకు గురిచేయాలని వారు ప్రయత్నిస్తున్నప్పటికీ ఎట్టిపరిస్థితిలో తలొగ్గద్దని ఎమ్మార్పీఎస్ నాయకులు భావిస్తున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  mandakrishna  mrps  

Other Articles