Seven year old female suicide bomber attacks nigeria

nigeria, potiskum, yabe state, human bomb

A seven-year-old girl killed herself and five others in a suicide bombing in Potiskum, Yobe State. The attack, occurred in a market, Vanguard reports.

మానవ బాంబ్ గా మారిన ఏడేళ్ల బాలిక

Posted: 02/24/2015 03:53 PM IST
Seven year old female suicide bomber attacks nigeria

ఏడేళ్ల ప్రాయంలో చిన్నారులు ఏం చేస్తున్నారో వారికి కనీస అవగాహన కూడా లేకుంటుంది. అభంశుభం తెలియని చిన్న వయస్సు చిన్నారులు రక్తపాతాన్ని సృష్టించారని అంటే ఎవరైనా నమ్ముతారా.. కానీ నైజీరియాలో నమ్మలేని ఓ ఘటన చోటుచేసుకుంది. ఏడేళ్ల ఓ చిన్నారి తనను తాను పేల్చుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా, 46 మందికి పైగా గాయపడ్డారు. ఈశాన్య నైజీరియాలోని పొటిస్కమ్‌లోని కిక్కిరిసిన మార్కెట్‌లో చోటుచేసుకున్న పేలుడు ఘటన వెనుక బొకొ హరామ్ హస్తముందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మాహుతిదాడులకు బొకొ హరామ్ పిల్లలను ఉపయోగించుకోవడంపై నైజీరియా దేశాధ్యక్షుడు గుడ్‌లక్ జోనాథన్ తీవ్రంగా పరిగణించారు. అయితే ప్రభుత్వ ఆరోపణలను బొకొ హరామ్ ఖండించింది. తాము ఈ దాడికి పాల్పడలేదని తెలిపింది. కాగా మూడు చక్రాల వాహనంలో వచ్చిన ఓ బాలిక మొబైల్ షాప్‌కు ఎదురుగా తన శరీరానికి కట్టుకున్న బాంబులను స్వయంగా పేల్చుకుందని, ఘటనలో గాయపడిన బాధితుడు పేర్కొన్నారు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nigeria  potiskum  yabe state  human bomb  

Other Articles