Victory venkatesh ramanaidu death news

venkatesh news, ramanaidu death news, ramanaidu cancer death, venkatesh ramanaidu news, ramanaidu death news, victory venkatesh press meet, venkatesh latest photos

victory venkatesh ramanaidu death news : tollywood victory venkatesh express his feelings after his father movie moghal ramanaidu death.

‘నాన్నగారు ప్రశాంతంగా తనువు చాలించారు’

Posted: 02/18/2015 06:34 PM IST
Victory venkatesh ramanaidu death news

మూవీ మొఘల్, చిత్రపరిశ్రమకు పెద్ద దిక్కుగా భావించే డి.రామానాయుడు మృతిపై ఆయన కుమారుడు, సినీనటుడు విక్టరీ వెంకటేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈరోజు (బుధవారం) మధ్యాహ్నం 2:30 గంటలకు నాన్నగారు మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు’ అంటూ ఆయన తెలిపారు.

రామానాయుడు నివాసం వద్ద మాట్లాడిన వెంకటేష్.. నాన్న చాలా ప్రశాంతంగా తనువు చాలించారని అన్నారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాన్నగారు ఇవాళ మధ్యాహ్నమే కన్నుమూశారని చెప్పారు. అలాగే గురువారం ఉదయం 9 గంటల తరువాత రామానాయుడు స్టూడియోలో ఆయన పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం వుంచుతామని చెప్పారు. అనంతరం మధ్యాహ్నం 3గంటల తరువాత అంత్యక్రియలు నిర్వహిస్తామని వెల్లడించారు.

ఇదిలావుండగా.. సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు భారీ సంఖ్యలో రామానాయుడి నివాసానికి చేరుకుని ఆయనకు సంతాపం ప్రకటించారు. ఇక ఈయన మృతిపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిరంజీవి, బాలకృష్ణ తదితర ప్రముఖ నటులు ఆయన మృతిపై విచారం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : victory venkatesh news  ramanaidu death news  

Other Articles