Girl brother charred to death in jaipur

girl brother charred to death in jaipur, would be bride burnt alive, would be bride, gayana, yuvaraj, brother and sister burnt alive, brother and sister charred to death, fire accident in jaipur, fire accident in bassi,

A girl and her 13-year-old brother were burnt alive when the makeshift home they were sleeping in caught fire in village near Bassi late on Sunday.

కాబోయే పెళ్లి కూతురు సజీవదహనం

Posted: 02/17/2015 04:49 PM IST
Girl brother charred to death in jaipur

రాజస్ధాన్‌లోని గుధమీనా గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. రాత్రి పూట్ అకస్మాత్తుగా వ్యాపించిన మంటలలో చిక్కి.. కాబోయే పెళ్లికూతురు సహా అమె తమ్ముడు మృత్యువాత పడ్డారు. గాఢ నిద్రిలో ఉన్న వారిని రక్షించేందుకు చేపట్టిన చర్యలు ఫలించకపోవడంతో అక్కతో పాటు 13 ఏళ్ల తమ్ముడు సజీవ దహనమయ్యారు. పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. లాల్ రామ్ మీనా, రాజంతి అనే దంపతులు తమ పిల్లలతో ఇంట్లో నిద్రిస్తుండగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో లాల్‌రామ్ పిల్లలు గయానా (18), యువరాజ్ (13) సజీవ దహనం అయ్యారని పోలీసులు వెల్లడించారు.

వచ్చే నెలలో పెళ్లి: సజీవ దహనమైన అక్కాతమ్ముడు ఈ ప్రమాదం ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో జరిగింది. పిల్లలను రక్షిద్దామని వెళ్లిన లాల్‌రామ్, రాజంతికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ అగ్ని ప్రమాదంలో ఆరు మేకలు కూడా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం సంభవించిన వెంటనే పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని సమీపంలో ఉన్న ఆసుపత్రికి పిల్లలు గయానా, యువరాజ్‌లను తరలించారు. వారు మృతి చెందినట్లుగా వైద్యులు గుర్తించారు. మృతదేహాలకు పోస్టు మార్టం నిర్వహించి తల్లి దండ్రులకు అప్పజెప్పామన్నారు. అయితే అగ్రి ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. గయానా వివాహం వచ్చే నెలలో జరిపేందుకు పెద్దలు అన్ని ఏర్పాటు చేసిన సమయంలో ఇలా జరగడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : girl  burnt alive  Fire  jaipur  

Other Articles