Rajinikanth producer rockline venkatesh linga movie distributors controversy

rajinikanth news, rockline venkatesh news, linga movie distributors, linga movie controversy, rajinikanth linga controversy, rajinikanth controversies, rajinikanth distributors clashes, linga movie distributors protest, linga movie news, linga movie

rajinikanth producer rockline venkatesh linga movie distributors controversy : Linga movie distributors has take decision that they will protest in the front of rajinikanth house for renew their money.

రజనీ ఇంటిముందు అడుక్కుంటున్న డిస్ట్రిబ్యూటర్లు...

Posted: 02/16/2015 04:33 PM IST
Rajinikanth producer rockline venkatesh linga movie distributors controversy

సూపర్ రజినీకాంత్ నటించిన ‘లింగ’ చిత్రం ఇటీవలె విడుదలైన విషయం తెలిసిందే! భారీ బడ్జెట్టుతో నిర్మించిన ఆ చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ మొత్తంలో డబ్బులు వెచ్చించి కొనేశారు. తమకు అసలుతోపాటు లాభాలపంట పండుతుందని అంతా అనుకున్నారు. కానీ.. మొత్తం గల్లంతయ్యింది. ఆ మూవీ డిజాస్టర్ అని తేలిపోవడంతో కలెక్షన్లు తగ్గిపోయాయి. దీంతో డిస్ట్రిబ్యూటర్లు లబోదిబోమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు... చేస్తూనే వున్నారు.

తమకు జరిగిన నష్టాన్ని భరించాల్సిందేనంటూ నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు ఆ మూవీ నిర్మాత, రజినీకి డిమాండ్ చేశారు. ఆందోళనలు కూడా చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన నిర్మాత రాక్ లైన్ వెంకటేష్.. మొదట అందుకు నిరాకరించిన మళ్లీ 10 శాతం పరిహారం చెల్లించేందుకు అంగీకరించారు. అయితే.. ఆ పరిహారం ఇవ్వడానిక్కూడా నిర్మాత వెనకడుగు వేస్తున్నాడని, తమకు జరిగిన నష్టాన్ని ఖచ్చితంగా తిరిగి ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు. అలా ఇవ్వని పక్షంలో వినూత్న రీతిలో ఆందోళనలు చేపట్టేందుకు తాము సిద్ధంగా వున్నామని డిస్ట్రిబ్యూటర్లు బైఠాయించారు.

‘లింగా’ మూవీని కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులు అందరూ కలిసి రజనీకాంత్ ఇంటిముందు అడుక్కుంటూ ఆందోళన చేసేందుకు సిద్ధపడుతున్నామని వాళ్లు తెలిపారు. నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ తొలుత తాము పదిశాతం పరిహారం చెల్లించేందుకు అంగీకరించారని, కానీ ఇప్పుడు నిరాకరిస్తున్నారని డిస్ట్రిబ్యూటర్ వడివేలన్ ఆరోపించారు. పైగా.. తాము అడుగుతున్న నష్టపరిహారం రజనీకి చెల్లించిన పారితోషికం కంటే చాలా తక్కువేనని.. తక్షణమే స్పందించకుంటే రజనీ ఇంటిముందు అడుక్కుంటూ సాగేలా ఆందోళన మొదలు పెడతామని వాళ్లు స్పష్టం చేశారు.

ఈ వ్యవహారం చూస్తుంటే మరింత వేడిగా కొనసాగేలా వుంది. మూవీ రిలీజ్ అయిన మొదటిరోజు నుంచి ఈ ఆందోళనలు జరుగుతున్నాయి. ఇప్పుడు మరింతగా పెచ్చుమీరిపోయాయి. ఇలాగే కొనసాగితే రజనీ ఇమేజ్ దెబ్బతినే అవకాశాలు వున్నాయి. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు చేపబడుతున్న వినూత్న ఆందోళనపై నిర్మాత వెంకటేష్, రజనీ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles