Cricket bookies arrested in hyderabad

cricket bookies arrested in hyderabad, india pakistan world cup match betting, india versus pakistan match, india vs pakistan world cup, betting over india vs pakistan match, match, india score, pakistan bookies arrested in hyderabad, Cricket bookies, arrested, World Cup Cricket Betting

india pakistan world cup match betting in hyderabad, police arrested bookies

అటు క్రికెట్ ఫీవర్.. ఇటు బుకీల అరెస్టు

Posted: 02/15/2015 02:52 PM IST
Cricket bookies arrested in hyderabad

క్రికెట్ అభిమానులను తెలియకుండానే నిండాగా ముంచేందు నగరంలోకి ముంబాయికి చెందిన మూకలు చేరుకున్నాయి. క్రికెట్ అభిమానంతో అభిమానులను బెట్టింగ్ పేరుతో నిట్టనిలువనా తీల్చేందుకు బుకీలు రెడీ అయ్యారు. ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్‌ల నేపథ్యంలో చాకచక్యంగా ముందుకుసాగుతున్నారు. పోలీసులకు చిక్కకుండా హైటెక్నాలజీ, సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు.  అధికారులు ఎన్ని పకడ్బందీ చర్యలు చేపట్టినా బెట్టింగ్‌కు అన్ని సెట్ చేసుకున్నట్లు సమాచారం. అయితే అధికారులు కూడా కొత్త పద్దతుల ద్వరా బుకీలను అరెస్టు చేసేందుకు అన్ని ఏర్పాటు చేశారు.
 
క్రికెట్ బెట్టింగ్ నిరోధానికి అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా, బుకీలు మాత్రం కొంత పంథాలో ముందుకు సాగుతూనే ఉన్నారు. ప్రపంచ కప్ క్రికెట్‌లో బెట్టింగ్ కోసం బుకీలు సోషల్ మీడియానూ ఆశ్రయిస్తున్నారు. మరోవైపు నగరంలో బెట్టింగ్ రాయుళ్ల భరతం పట్టేందుకు నగర పోలీసు కమిషనరేట్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్‌ఓటీ) పోలీసులు సిద్ధమవుతున్నారు.

ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీ సుమారు రెండు నెలల పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో జరుగనుం ది. ఆదివారం జరిగే పాక్, ఇండియా మ్యాచ్‌లో భారీగా బెట్టింగ్ జరిగే అవకాశం ఉంది. గతంలో నగరంలో పట్టుబడిన క్రికెట్ బుకీల వివరాలను జంట పోలీసు కమిషనర్లు ఎం.మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్‌లు తెప్పిం చుకున్నారు. వారిపై నిఘా పెట్టారు. పేరు మోసిన బుకీలతో పాటు ఈ సారి హుక్కా సెంటర్ల నిర్వాహకులు కూడా బుకీల అవతారం ఎత్తే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని హుక్కా సెంటర్లలో పెద్ద పెద్ద ఎల్‌సీడీ టీవీలు ఏర్పాటు చేశారు. వారంలో 1000కిపైగా ఎల్‌సీడీ టీవీలు నగరంలో అమ్ముడయ్యాయి. వీటిని  క్రికెట్ మ్యాచ్‌ల కోసమే ఖరీదు చేశారు.
 
నగరం, శివార్లలోని కొన్ని లాడ్జీల్లో బుకీలు ముందుగానే కొన్ని గదులను బుక్ చేసుకున్నట్లు సమాచారం. మ్యాచ్ జరిగే రోజున లాడ్జీలో ల్యాప్‌టాప్‌లు, టీవీలు ద్వారా వీరు దందా నిర్వహిస్తారు. ఆన్‌లైన్ బ్యాకింగ్ ద్వారా బెట్టింగ్ వ్యవహారం నిర్వహిస్తారు. అలాగే కొందరు శివారులోని ఫాం హౌస్‌లు, రిసార్ట్స్‌లను కేంద్రంగా చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. నగరంలోని బెట్టింగ్ కేంద్రాలకు ముంబై మాఫియా హస్తం ఉన్నట్లు సమాచారం. గతంలో కూడా టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేసి పట్టుకున్న సందర్భాల్లో ఈ విషయం వెల్లడైంది. నగరంలో  నడిచే క్రికెట్ బెట్టింగ్‌లో  ముంబై నుంచి బెట్టింగ్‌లు నడుస్తాయి.
 
క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లు, బుకీలపై  నిఘా పెట్టామని టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి అన్నారు. ఈ మేరకు అన్ని జోన్‌ల టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బందిని అప్రమత్తం చేశామని చెప్పారు. లాడ్జీలు, హుక్కా సెంటర్లపై వరుస తనిఖీలు చేపడుతున్నామన్నారు. నగరంలో  బెట్టింగ్ జరగకుండా చూస్తామని, బెట్టింగ్‌ నిర్వహణలపై ఎవరికైనా సమాచారం వుంటే తమకు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా వుంచుతామని లింబారెడ్డి తెలిపారు.
            
జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india pakistan world cup match betting  

Other Articles