Two funeral on the same funeral pyre

two funeral on same funeral pyre, wife and husband on one funeral pyre, lovers on one funeral pure, tamilnadu velure lovers, wife died while delivery, husband too died, tamilnadu, vellore, Two funeral, same funeral pyre,

lover not ready live without his wife ended life on the same day in tamilnadu,

ప్రేమకు సరికొత్త బాష్యం చెప్పిన ప్రేమికులు..

Posted: 02/15/2015 02:43 PM IST
Two funeral on the same funeral pyre

ప్రేమికుల రోజున వారి ప్రేమకు గుర్తుగా తమ సంతానానికి జన్మనివ్వాలనుకున్నారు ఆ ఇద్దరు ప్రమికులు. ప్రేమించి పెళ్లి చేసుకుని పలువురు ప్రేమికులకు ఆదర్శంగా నిలిచిన వారు తమ బిడ్డకు వాలెంటైన్స్ డే రోజునే జన్మనిచ్చి ప్రేమకు నిర్వచనం చెబుదామనుకున్నారు. తల్లిదండ్రులు కాబోయే తరుణంలో భార్య ప్రసవ వేదనతో కన్నుమూసింది. ఆమె మరణాన్ని జీర్ణించుకోలేక భర్త కూడా కన్నుమూశాడు. దంపతుల మృతదేహాలను ఒకే చితిపై పెట్టి అంత్యక్రియలు పూర్తిచేశారు. తమిళనాడు వేలూరు జిల్లా మాట్లపట్టి అన్నానగర్‌లో ప్రేమికుల రోజున ఈ విషాదం చోటుచేసుకుంది.

మాట్టపల్లికి చెందిన మునియప్పన్(30), సత్య (23) రెండేళ్లు ప్రేమించుకుని గత ఏడాది పెళ్లి చేసుకున్నారు. గర్భవతి అయిన సత్యకు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నొప్పులు వచ్చాయి. ఆ సమయానికి మునియప్పన్ వేరే ఊళ్లో ఉండటంతో ఇరుగుపొరుగులు ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆమె ఇంట్లోనే ప్రాణాలు విడిచింది. విషయం తెలుసుకున్న మునియప్పన్ వేగంగా ఇంటికి చేరుకుని భార్య శవాన్ని చూసి భోరుమన్నాడు. భార్య అంత్యక్రియల ఏర్పాట్లు సాగుతుండగా బిగ్గరగా విలపించాడు. బంధువులు ఓదారుస్తుండగానే గుండెను చేత్తో పట్టుకుని కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. దాంతో భార్యాభర్తల మృతదేహాలను ఒకే చితిపై ఉంచి అంత్యక్రియలు పూర్తిచేశారు.
            
జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : same funeral pyre  wife and husband  tamilnadu  

Other Articles