Kiran bedi on her failure

delhi results, kiran bedi, bjp in delhi, fathwa, muslims votes in delhi

kiran bedi on her failure : bjp cm candidate kiran bedi review the delhi elections. she said that fathwa from muslim community effect the poll result.

ఆ ఫత్వా వల్లే ఓడిపోయా...లేదంటేనా !

Posted: 02/12/2015 09:47 AM IST
Kiran bedi on her failure

ఢిల్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన కిరణ్ బేడి, ఎన్నికల ఫలితాలపై భిన్నంగా స్పందించారు. ముందు ఓటమికి తానే బాధ్యత వహిస్తానని ప్రకటించిన బేడి తరువాత మాత్రం ఇది తన ఓటమి కాదు బిజెపి ఓటమి అంటూ మాట మార్చింది.కిరణ్ బేడి భర్త కూడా బిజెపి కార్యకర్తల వల్లే ఓటమి అంటూ వ్యాఖ్యానించారు. ఇలా కిరణ్ విఫలానికి రకరకాల భాష్యాలు చెప్పుకొచ్చారు.

ఢిల్లీ ఎన్నికల్లో తన ఓటమికి గల కారణాలపై కిరణ్ బేడి తాజాగా సమీక్ష నిర్వహించారు. ముస్లిం మత పెద్దలు విడుదల చేసిన ఫత్వా వల్లనే తనకు ఓటమి కలిగిందని ఆమె విశ్లేషించారు. ముస్లింలు అంతా ఆప్ కు ఓటు వెయ్యాలని ఫత్వా రావడం వల్ల ఒక్క ముస్లిం ఓటు తనకు పడలేదని తెలిపారు. అయితే ముస్లిం పెద్దల ఫత్వాపై కేజ్రీవాల్ గతంలోనే తిరస్కారం తెలిపారు. కాగా కిరణ్ బేడి వ్యాఖ్యలపై బిజెపి ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చెయ్యలేదు. ఢిల్లీ ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోది తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : delhi results  kiran bedi  bjp in delhi  fathwa  muslims votes in delhi  

Other Articles