Krishna board wrote a letter to ap and ts

krishna board, krishna water, ap on krishna water, ts on krishna board, water board, disputes bitween ap and ts

krishna board wrote a letter to ap and ts. : krishna river board wrote a letter to both ap and ts govt. to clear their disputes themselves.

తాంబూలం ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్లు

Posted: 02/11/2015 12:06 PM IST
Krishna board wrote a letter to ap and ts

రెండుగా విడిపోయిన తెలుగు రాష్ట్రాల నదీ జలాల వివాదాలకు పరిష్కారం చూపాల్సిన కేంద్రం స్పందించడం లేదు. పైగా మీరు మీరు చూసుకోండి మాకేం సంబందం లేదు అన్నట్లు వ్యవహరిస్తోంది. కృష్ణానది జలాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పరస్పరం విమర్శించుకుంటున్నాయి. ముందు ఈ మొత్తం వ్యవహారంపై కేంద్రం నుండి ప్రత్యేక అధికారులను పంపించాలని భావించినా, చివరకు ఆ నిర్ణయాన్ని విరమించుకుంది. వివాదాల పరిష్కారానికి రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులు చర్చించి, తుది నిర్ణయం తీసుకోవాలని కృష్ణా యాజమాన్య బోర్డ్ ఓ ప్రకటన విడుదల చేసింది.

రెండు తెలుగ రాష్ట్రాలకు ముందు నుండి జలాలపైనే ప్రధాన వివాదం. అయినా అప్పటి యుపిఎ సర్కార్ వాటికి పూర్తి స్థాయి పరిష్కారాన్ని చూపించకుండా రాష్ట్ర విభజన చేసింది. దాంతో ఇప్పుడు రెండు రాష్ట్రాలు జలాలపై వాటాలను తమ రాష్ట్రానికి అనుకూలంగా లెక్కలతో చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే పరిమితికి మించి నీటిని వాడుకుందని ఇక మీదట ఒక్క నీటి బొట్టును కూడా కింద వదలబోమని తెలంగాణ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరో పక్క తెలంగాణ లేవనెత్తిన అంశాలు తప్పని వాదిస్తోంది ఏపి. న్యాయ బద్దంగా తమకు రావలసిన వాటాను మాత్రమే తాము వాడుకున్నామని ఏపి వివరిస్తోంది.

ఇలా ఏ రాష్ట్రం తమ వాదనలే సరైనవంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా కృష్ణా జలాల యాజమాన్య బోర్డు మాత్రం ఎలాంటి చర్యలకు దిగడం లేదు. చర్చల ద్వారా వివాదాలకు తెర దెంచే ప్రయత్నమూ చెయ్యలేదు. పైగా మీ గొడవలు మీరే పరిష్కారించుకోవాలని ఉచిత సలహా ఇస్తోంది. తరువాతి పరిస్థితిపై ఈ నెల 130 కల్లా తమకు లేఖ రాయాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. దీనిపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ప్రకటన చెయ్యలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం వివాదాన్ని వివరిస్తు ట్రిబ్యునల్ ను ఆశ్రయించనున్నట్లు సమాచారం. గతంలో ఇచ్చిన లెక్కలు సరైనవి కాదని, కొత్త లెక్కలతో ట్రిబ్యురల్ ముందుకు వెళ్లాలని టిసర్కార్ భావిస్తున్నట్లు సమాచారం.

-అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles