ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఆప్ పై ప్రశంసలు కురిపిస్తున్న వారు బిజెపికి చివాట్లు పెడుతున్నారు. ఇప్పటికే ఇంటర్నెట్ లో రకరకాల ట్వీట్లు చేస్తున్నారు ఆప్ అభిమానులు. అయితే ఇప్పటి వరకు బీజెపి పార్టీ కి చెందిన ఏ నాయకుడు వ్యతిరేకంగా మాట్లాడలేదు. అయితే మహారాష్ట్రలో బీజెపితో కలిసి ప్రభత్వాన్ని ఏర్పాటు చేసిన శివసేన అధ్యక్షులు ఉద్దవ్ థాక్రే పరోక్షంగా మోదీని టార్గెట్ చేస్తు వ్యాఖ్యలు చేశారు. దేశ మొత్తం కొనసాగుతున్న చరిష్మాకు భిన్నంగా ఢిల్లీ ప్రజలు ఓ సునామిని సృష్టించారని అన్నారు.
దేశం మొత్తం మోదీ చరిష్మా కొనసాగిందని, కానీ ఢిల్లీ ప్రజలు మాత్రం సునామిని పుట్టించారు అన్నది ఆయన మాటల సారాంశం. మొత్తానికి బిజెపి ఫలితాలపై తమ మిత్రపక్ష పార్టీలకు చెందిన నేతలు ఇలా వ్యాఖ్యలు చెయ్యడం గమనార్హం. కాగా గత సాధారణ ఎన్నికల్లో బిజెపి శివసేనతో విభేదించి, స్వతంత్రంగా పోటీ చేసింది. కానీ పూర్తి స్థాయి మెజారిటీ రాకపోవడంతో తిరిగి శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
కాగా ఎన్నికల నగారా మోగినపుడు ముందుగానే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఢిల్లీ ఎన్నికలు మోదీ ప్రభుత్వ పని తీరుకు రెఫరండం కాదు అంటూ వ్యాఖ్యానించారు. తరువాత కిరణ్ బేడిని పార్టీ తరఫున బరిలో దింపి పార్టీ పరాభవానికి తనదే బాధ్యత అంటూ వివరణ కిరణ్ బేడితో ప్రకటన చేయించారని విమర్శ. గత ఎన్నికల్లో మోదీ మంత్రంతోనే అధికారానికి దగ్గర కాగలిగిన బీజేపి, ఇప్పుడు ఢిల్లీలో మాత్రం కిరణ్ బేడిని ముందుంచారు. ఢిల్లీ ఎన్నికలను ముందు నుండి సవాల్ గా తీసుకున్న బీజెపి మోదీతోనూ ప్రచారం చేయించింది. కానీ మోదీ మంత్రం ఢిల్లీలో అస్సలు పారలేదని అర్థమవుతోంది. బీజేపి ఓటమిపై ఇంకా ఎంత మంది ఘాటుగా స్పందిస్తారో చూడాలి.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more