Hyderabad gang rape shared on whatsapp

gang rape, Sunitha Krishna, Prajwala India, gang rape in India, rapes in India, crime, gang rape in Hyderabad, gang rape in WhatsApp Rape videos in Whatsapp. youtube, gang rape video goes viral on social media, gang rape video goes viral on whatsapp,

Gang Rape shared on WhatsApp – Sunitha Krishnan posted rape videos in YouTube and asked to trace the culprit

ITEMVIDEOS: వాట్సప్ లో గ్యాంగ్ రేప్ వీడియో కలకలం.. నిందితులు వీళ్లే..

Posted: 02/06/2015 01:23 PM IST
Hyderabad gang rape shared on whatsapp

హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. మృగాళ్ల పైచాకిత్వానికి మరో యువతి బలి అయ్యింది. ఒక అబాగినిపై ఐదుగురు మృగాళ్లు తోడేళ్లలా విరుచుకుపడ్డాయి. తమ కామవాంఛను తీర్చుకున్నాయి. ఇంత జరిగినా ఈ విషయం మాత్రం పోలీసుల దరికి చేరలేదు. వారికి కనీసం పిర్యాదు అందలేదు. ఇలా ఎందరో అబలలు బలి అవుతున్నా.. వాటిని సభ్య సమాజంలో చెప్పుకోలేక, సమాజం తమను వెలివేస్తుందన్న భయంతోనో, లేక మరో కారణంతోనే పోలిస్ స్టేషన్ వరకు వెళ్లడం లేదు. అదే అసరాగా చేసుకున్న కామ తోడేళ్లు మహిళలు, యువతులను టార్గెట్ చేస్తూ.. వారిని జీవితాలను చిధ్రం చేస్తున్నాయి.

బాధితులరాలికి తెలియకుండానే అమెపై జరుగుతున్న పైశాచికత్వాన్ని సెల్ ఫోన్లలో రికార్డు చేసి వాటిని వాట్సప్ ద్వారా తమ స్నేహితులకు పంపుతూ తాము చేసిన దారుణాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు. యువతిపై అత్యాచారానికి వెళ్లే క్రమంలో వారంతా ఎదో ఘనకార్యం చేశామని ఫోటోలకు ఫోజులిచ్చారు. అంతే కాదు ఈ వీడియోలను చూపించి బాధితురాళ్లపై మరోమారు అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. ఇదే క్రమంలో హైదరాబాద్ లోని ఓ యువతిపై ఐదుగురు మగమృగాళ్లు గ్యాంగ్ రేప్ కు పాల్పడుతూ ఆ వీడియోను తీసి వాట్యాప్ లో పోస్టు చేశారు. ఈ వీడియో అలా అలా చక్కర్లు కోడుతూ మనుషుల అక్రమ రవాణకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రముఖ కార్యకర్త సునితా కృష్ణన్ ను చేరాయి.

వెంటనే అప్రమత్తమైన ఆమె సదరు నిందితులకు శిక్ష పడేలా చేయాలని వారి ముఖాలను ట్రేస్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. నిందితులు గుర్తించి ఆనవాళ్లు తెలిసిన వారు తమకు సమాచారం అందించాలంటూ అమె తన మెయిల్ ఐడీని కూడా అందులో పోందుపర్చారు. మన అనుకునే వారిపైనే ఇలాంటి ఘటనలు జరిగితే ఎలా స్పందిస్తామో .. అలానే స్పందించండి. మీరు చేయాల్సిందేమీ లేదు. నిందితులు ఫలానా చోట వున్నారని సునితా కృష్ణన్ కు సమాచారం అందిస్తే చాలు. చెడు జరగకుండా అపే ధైర్యం లేకపోయినా ఫర్వాలేదు.. కానీ చెడు చేసిన వారు పక్కనే వున్నా వారి గురించి దాయడం చెడును ప్రోత్సహించమే అవుతుంది. ఇలాంటి కామాంధులు గురించి మీకు సమాచారం తెలిస్తే వెంటనే ఈ మెయిల్ చేయండి.

ఈ విషయమై సునితా కృష్ణన్ కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీని కూడా కలవనున్నారు. బాధితురాలికి న్యాయం చేయాల్సిందిగా, నిందితులను గుర్తించి శిక్షించాల్సిందిగా అమె కోరనున్నారు. ఇందుకు ప్థానిక పోలీసుల సాయం కూడా అందేలా ఆశేశాలు జారీ చేయాలని కేంద్ర మంత్రి మేనకా గాంధీని కోరనున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gang Rape  WhatsApp  Sunitha Krishna  

Other Articles