Educated indian women may find it hard to get a match by 2050

Educated Indian women, difficult for Indian women, Indian women hardly find eligible partner, university or college-level educated women wont get eligible partner, reseasch on indian marriages, london oxford university study, survey on indian marriages

By 2050, it will be more difficult for Indian women to find an eligible partner, particularly if they have been educated at university or college-level, according to new research

విద్యావతులైన పడతులకు పతుల్ దోరుకుట కష్టమా..?

Posted: 02/05/2015 06:43 PM IST
Educated indian women may find it hard to get a match by 2050

యూనివర్సిటీ, కాలేజీ స్థాయి చదువు పూర్తిచేసిన భారతీయ యువతులకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం కనుగొన్నారు. లండన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఇటీవల చేసిన సర్వేలో ఓ సరికొత్త విషయాన్ని వెల్లడించారు. రాబోయే కాలంలో ఉన్నత చదువులు చదివిన యువతులకు వివాహమయ్యేది కష్టమేనంటున్నారు. ప్రస్తుతం దేశంలో అనుసరిస్తున్న వివాహ విధానమే కొనసాగితే 2050 సంవత్సరంనాటికి విద్యాధికులైన మహిళలకు తగిన వరుడు లభించక పెండ్లి కావడం కష్టమవుతుందని ఓ అధ్యయనంలో తేలింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, బార్సిలోనాకు చెందిన సెంటర్ ఫర్ డెమోగ్రాఫిక్ స్టడీస్, అమెరికాలోని మిన్నెసోటా పాపులేషన్ సెంటర్ సంయుక్తంగా ఈ అధ్యయనం జరిపాయి.

భారత్‌లో ప్రస్తుతం మహిళలకు తమకన్నా ఎక్కువ చదువుకున్న, ఎక్కువ వయసున్న మగవారితోనే వివాహం జరుగుతున్నది. అయితే ఇటీవలికాలంలో మహిళలు విద్యలో మరింత గొప్పగా రాణిస్తూ ఉన్నతవిద్యలో పురుషుల కన్నా ముందుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే తమకన్నా ఎక్కువ విద్యార్హత కలిగిన వరుడినే వారు కోరుకుంటారని, దాంతో వారికి తగిన జీవితభాగస్వామి లభించడం కష్టమవుతుందనేది ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : unmarried women  survey  Demography  husbands  

Other Articles