Telangana sarkar cm kcr fast scheme feez reimbursement students

cm kcr, fast scheme, fees reimbursement scheme, telangana fees scheme, fast reimbursement scheme, talasani srinivas yadav, kadiyam srihari news, telangana students, andhra pradesh students

telangana sarkar cm kcr fast scheme feez reimbursement students : cm kcr clarifies that the fast scheme is cancelled

‘ఫాస్ట్’గా పథకాన్ని వాపస్ తీసుకున్న తెలంగాణ సర్కార్

Posted: 01/31/2015 10:50 AM IST
Telangana sarkar cm kcr fast scheme feez reimbursement students

విద్యార్థుల ఫీజు రీయింబర్స్’మెంట్ చెల్లింపు కోసం తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ‘ఫాస్ట్’ పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే! ఈ పథకం ప్రకారం 1956 స్థానికతగల విద్యార్థులకే ఫీజు రీయింబర్స్’మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో 1956 స్థానికత లేనివారితోపాటు ఆంధ్ర, ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ఫీజు అందక, అది వారి భవిష్యత్తును దెబ్బతీస్తుందనే ఉద్దేశంతో మొదటి నుంచి వ్యతిరేకత వెల్లడయ్యింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాల మధ్య వాదోపవాదనలు కూడా జరిగాయి. చివరకు ఈ వ్యవహారం కోర్టుదాకా వెళ్లింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఇతర రాష్ట్రాల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతీస్తుందని భావించి, దీనిపై స్టే విధించింది.

అయితే.. తాజాగా ఈ ‘ఫాస్ట్’ పథకాన్ని రద్దు చేస్తున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. పాత ఫీజు రీయింబర్స్ మెంట్ విధానాన్ని కొనసాగిస్తామని ప్రకటించింది. పేద విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కావడంతో.. దీనిపై కేబినేట్ సమావేశంలో నిర్వహించిన సుదీర్ఘ చర్చానంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలో సీఎం అధ్యక్షతన సమావేశమైన రాష్ట్రమంత్రివర్గంలో సుమారు ఏడుగంటలకు పైగా భేటీ జరిగింది. అనంతరం ‘ఫాస్ట్’ పథకంపై కేబినేట్’లో తీసుకున్న నిర్ణయాలను స్వయంగా ప్రకటించారు. వివాదాలకు తావు లేకుండా ఈ ఫాస్ట్ పథకాన్ని ఉపసంహరించుకున్నట్లు ఆయన తెలిపారు.

ఈ నేపథ్యంలోనే కేసీఆర్ స్పష్టం చేస్తూ.. ఈ ఏడాదికి సంబంధించిన ఫీజులను విడుతలవారీగా విడుదల చేస్తామని, త్వరలోనే కొన్ని నిధులు మంజూ చేస్తామని అన్నారు. విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యం ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేసీఆర్ భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వం నాలుగేళ్ల బకాయిలు తమ ప్రభుత్వంపై భారం మోపిందని, దాదాపు రూ.1800 కోట్లమేరకు ఆ బకాయింపులు వున్నాయని తెలిపారు. అందులో ఇప్పటికే కొంత  చెల్లించామని పేర్కొన్న ఆయన.. ఇంకా రూ.862 బకాయిలున్నట్లు పేర్కొన్నారు. వాటిని కూడా వెంటనే విడుదల చేస్తామని చెప్పారు. అయితే.. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం అమలులో విద్యార్థుల స్థానికత నిర్ధారణ కోసం 371డీ నిబంధనను మాత్రం పాటిస్తామని, అందులో ఎటువంటి వివాదం వుండదని తెలిపారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cm kcr press meet  fast fee reimbursement scheme  telangana andhra students  

Other Articles