Train waits half an hour for minister palle raghunatha reddy

rain waits for minister, train waits half an hour for minister, railways, train, Andhrapradesh minister, minister palle raghunath reddy, palle raghunath reddy, prashanthi express, guru raghavendra silver jubliee celebrations,

train waits half an hour for Andhra pradesh minister palle raghunatha reddy

అమాత్యులు వెళ్లాలంటే.. రైలు కూడా నిలవాల్సిందే..

Posted: 01/27/2015 09:16 AM IST
Train waits half an hour for minister palle raghunatha reddy

ఆయన రాష్ట్ర మంత్రివర్యులు.. అందులోనూ నిత్యం వార్తల్లో వుండి.. ప్రతిపక్షాలను ఉతికి ఆరేయడంలో దిట్టైనవారు. ఆయనే ఏపీ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి. మంత్రిగారు ఓ కార్యక్రమానాకి హాజరవుదామని బయలుదేరుతుండగా, పార్టీ సభ్యలు తమను పిలవని పేరంటానికి మీరేందుకు హాజరవుతారని నిరసన తెలిపారు. దీంతో ఆయన తిరుగు ప్రయాణాం కావాల్సి వచ్చింది. మంత్రి గారు.. దానికి తోడు అధికార దర్పం వుంది. అనుకున్నదే తడవుగా ఆయన తిరుగు ప్రయాణం అయినా.. రైలు దొరకదు. అందుకోసం కోసం ఏకంగా రైలునే అరగంట పాటు నిలిపు చేయించారు. మంత్రిగారా .. మజకా..

వివరాల్లోకి వెళ్తే.. మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి నంద్యాల ఎన్‌జీఓ కాలనీలోని సాయి గురురాఘవేంద్ర సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ప్రారంభించడానికి మంత్రి పల్లె రఘునాథరెడ్డి రావాల్సి ఉంది. ఉత్సవాల్లో పాల్గొనడానికి ఆయన వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నుంచి బయలుదేరారు. కాని తమను ఆహ్వానించకుండా నిర్వహిస్తున్న వేడుకలకు మంత్రి హాజరు కావడం సరికాదని స్థానిక టీడీపీ నేత అధిష్ఠానానికి ఫిర్యాదు చేశాడు. దీంతో స్థానిక నాయకుల ఆగ్రహానికి ఎందుకు గురకావడం అనుకున్న మంత్రి.. ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

సమాచారాన్ని స్థానిక రెవెన్యూ అధికారులకు అందించేయడంతో.. వారు హుటాహుటిన రైల్వే స్టేషన్ చేరుకుని విజయవాడా మీదుగా బెంగళూరు నుంచి విశాఖపట్టణం వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలును కర్నూలు జిల్లా నంద్యాలలో సుమారు అరగంట సేపు ఆపేశారు. అమాత్యులకు ఏ  నిర్ణయం తీసకున్నా.. అది ప్రజలకు హితంగా మారాలి తప్ప.. ఇలా ఇబ్బందుల పాలు చేయకూడదు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : train  palle raghunatha reddy  prashanti express  

Other Articles