Isis militants groups hack malaysian airlines website

isis militants, isis militants groups, cyber caliphate groups, malaysian airlines website, malaysian website, malaysian airlines, isis hack website

isis militants groups hack malaysian airlines website : isis militants groups cyber caliphate hack malaysian airlines website.

ISIS ఉగ్రవాదులు ‘హ్యాక్’ చేస్తారా?

Posted: 01/26/2015 04:02 PM IST
Isis militants groups hack malaysian airlines website

ISIS ఉగ్రవాదులు చేస్తున్న దారుణాలు ప్రపంచప్రజల్ని కలచివేస్తున్న విషయం తెలిసిందే! ఇప్పుడు తాజాగా ఈ ఉగ్రవాదులు ఓ వెబ్’సైట్’ను హ్యాక్ చేసినట్లు సమాచారం! అది కూడా మరెవ్వరిదో కాదు.. గతేడాదిలో వరుసగా రెండుమూడు విమానాలు కుప్పకూలిన మలేషియా ఎయిర్ లైన్స్ వెబ్ సైట్’ని! ఈ ఎయిర్ లైన్స్’కు సంబంధించిన రెండు పెద్ద విమానాలు ప్రమాదానికి గురికాగా.. ఎంహెచ్ 370 విమానం కనపడకుండా పోయింగి. ఇంతవరకు దాని ఆచూకీ తెలియరాలేదు. అలా వరుసగా ప్రమాదానికి గురైన మలేషియా ఎయిర్’లైన్స్ వారి వెబ్’సైట్’నే ఈ ISIS ఉగ్రవాదులకు గ్రూపుకు చెందిన ‘సైబర్ క్యాలిఫేట్’ బృందం ‘హ్యాక్’ చేయడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది.

ఈరోజు (26-01-2015) వెబ్ సైట్’ను ఓపెన్ చేయగా.. ‘‘404 - విమానం ఆచూకీ దొరకలేదు. ఆ విమానాన్ని సైబర్ కాలిఫేట్ హ్యాక్ చేసింది’’ అని మెసేజ్ వెక్కిరించింది. కాసేపు తర్వాత ఒక బల్లి బొమ్మ ఆ వెబ్ సైట్ స్ర్కీన్’పై కనిపించింది. దీంతో ప్రజలందరూ మొదటగా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే మరికొద్దిసేపు తర్వాత తిరిగి వెబ్’సైట్ పునరుద్ధరించబడింది. అయితే.. కనిపించకుండా మలేషియన్ విమానాల వెబ్’సైట్’ను ISIS గ్రూపుకు చెందిన ‘సైబర్ క్యాలిఫేట్’ బృందం హ్యాక్ చేయడంపై అనుమానాలు వెలువడుతున్నాయి. ఆ విమానాల  ప్రమాదానికి గురికావడానికి, ఎంహెచ్ 370 విమానం కనిపించకుండాపోవడం వెనుక వీరి హస్తమేమైనా వుందా..? అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cyber caliphate  isis militants groups  malaysian airlines  

Other Articles