Sourav declined bjp offer

sourav ganguly in to politics, sourav ganguly not joinig BJP, sourav ganguly joinig BJP, sourav ganguly videos, sourav ganguly twitter, sourav ganguly facebook, sourav ganguly biography, sourav ganguly news, sourav ganguly latest updates, sourav ganguly, bjp, cricket, team india, trinamool congress, swach bharat, mamata banerjee, Siddharth Nath Singh, Prime Minister, national secretary, Narendra Modi

Former Indian captain Sourav Ganguly has dismissed the reports of him joining the BJP saying he has declined the offer given to him by the party.

సౌరవ్ గంగూలీ.. రెండు సార్లు తిరస్కరించాడు

Posted: 01/22/2015 06:20 PM IST
Sourav declined bjp offer

తాను బీజేపీలో చేరనున్నట్లుగా వస్తున్న వార్తలపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ తోసిపుచ్చారు. బీజేపిలో చేరమని, రాజకీయాల్లోకి రమ్మని తనకు ఆ పార్టీ పెద్దల నుంచి పిలువు వచ్చిందని, అయితే తాను ఆ అవకాశాన్ని  సున్నితంగా తిరస్కరించానని గంగూలీ చెప్పారు. తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశాడు. గత సార్వత్రిక ఎన్నికల ముందు కూడా తాను బీజేపి తరపున బరిలోకి దిగుతున్నానని వార్తలు గుప్పమన్నాయని, కానీ తనకు ఎన్నికలలో పోటీ చేయాలని లేదన్నారు.

సౌరభ్ రాజకీయాల్లోకి వస్తారని వార్తలు గత కొంత కాలంగా చక్కర్లు కోడుతున్నా వాటిని ఎప్పటికప్పుడు ఆయన ఖండిస్తూనే వున్నారు. భారత్ క్రికెట్‌లో ఎక్కువ అభిమానులను సంపాదించుకున్న క్రికెటర్లలో గంగూలీ ఒకడు. గంగూలీ బీజేపీలోకి చేరితే.. పశ్చిమ బంగాల్‌లో పార్టీ పుంజుకోవడంతో పాటు తృణమూల్ కాంగ్రెస్‌కు గట్టి పోటీనిస్తుందని పార్టీ శ్రేణులు అభిలాషించారు.

కాగా, అటు సౌరభ్ గంగూలీ తమ పార్టీలో చేరుతున్నారన్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని బీజేపీ తేల్చి చెప్పింది. బీజేపీ జాతీయ సెక్రటరీ సిద్దార్ధ నాథ్ సింగ్ గురువారం ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. బీజేపీలోని కొంత మంది నాయకులు ఆయనతో మంచి సంబంధాలు కలిగి ఉన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. బీజేపీలో చేరే విషయమై ఆయనతో ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో సౌరభ్‌ను డిసెంబర్ 2014న నామినేట్ చేశారు. స్వచ్చ్ భారత్ లో పాల్గొనాలని ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపుకు గంగూలీ స్పందిస్తూ ప్రధాని ఆహ్వానం మేరకు స్వచ్చ్ భారత్‌లో పాల్గొంటానని కాని రాజకీయాలలోకి మాత్రం రానని ఇప్పటికే సౌరవ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  ganguly joining BJP  Sourav Ganguly  

Other Articles