Fresh input of let attack during barack obama s india visit

LeT, barack Obama, Republic day celebrations, Narendra Modi, PM marendra modi, Central intelligence agencies, Pakistan-based lashkar e taiba, terror attacks across india, Border Security Forces (BSF), 1,000 more troops along border, US President Barack Obama, Obama's Republic Day visit, terrorists may cross over at Kathua in JK, LeT operatives Abdullah Shaheen and Taya Rafiq., Jaish-e-Mohammed (JeM)

Days ahead of US President Barack Obama’s arrival in India, the Central intelligence agencies have warned that the Pakistan-based Lashkar-e-Tayyaba outfit is planning terror attacks across the country, prompting India to effectively seal its international border with Pakistan.

ఒబామా పర్యటన నేపథ్యంలో నిఘావర్గాల హెచ్చరికలు..

Posted: 01/20/2015 08:46 PM IST
Fresh input of let attack during barack obama s india visit

భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరవుతున్న నేపథ్యంలో దాయాది దేశం పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం వుందని భారత నిఘావర్గాలు హెచ్చరించాయి. దీంతో సరిహద్దు ప్రాంతంలో మరో వెయ్యి మంది సరిహద్దు భద్రతా దళాలను కేంద్రం మోహరించింది. అగ్రరాజ్య అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత గణతంత్ర్య వేడుకలకు ముఖ్యఅతిధిగా హాజరవుతున్న క్రమంలో దాడులకు తెగబడాలని కుట్ర పన్నినట్లు తెలుస్తోంది.  

బ్రిటన్ నిఘా వర్గాల సమాచారం ప్రకారం..భారతదేశంలో ఉగ్రవాద దాడులు చేసే ప్రమాదం ఉందని నిఘా వర్గాల హెచ్చరికలు జారీ అయ్యాయి. వెంటనే వాటికి అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని భారత్ ఆలోచనలు చేస్తుంది. ఉగ్రవాదంపై భారత్-బ్రిటన్‌ల మధ్య జనవరి 15, 16 తేదీల్లో జరిగిన ఇండో-యూకే కౌంటర్ టెర్రరిజం జాయింట్ వర్కింగ్ గ్రూపు సమావేశంలో భారత అధికారులకు బ్రిటిష్ అధికారులు ఈ వివరాలు వెల్లడించినట్లు సమాచారం. భారత్ ఉగ్రవాదం పై ఇప్పటికైనా పాక్ కళ్ళు తెరవాలని, ఆ విషయాన్ని పాకిస్ధాన్‌కు చెప్పాలని బ్రిటిష్ అధికారులకు తెలియజేసింది.

చిట్టిసింగ్ పురా తరహాలో దాడులకు తెగబడాలని పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కుయుక్తులు పన్నుతున్నాట్లు భారత్ నిఘావర్గాలకు సమాచారం అందింది. ఒబామా పర్యటనలో వుండగానే లష్కరే తోయిబా సహా జైషే మహ్మమద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన తీవ్రవాదులు భారత సరిహద్దులోకి చోచ్చుకోచ్చి దాడులకు తెగబడనున్నాయని సమాచారం. అబ్దుల్లా షాహీన్, తయా రఫీక్ నేతృత్వంలోని రెండు బృందాలలో 12 నుంచి 15 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు భారత సరిహద్దులోని కత్తువా నుంచి ప్రవేశించేందుకు రంగం సిద్దం చేసుకున్నారని నిఘావర్గాలు హెచ్చరించాయి. ఇప్పటికే అబ్దుల్ రషీద్ నేతృత్వంలోని మరో పది మంది ఉగ్రవాదులు పూంచ్ జిల్లా నుంచి చోచ్చుకోచ్చేందుకు సరిహద్దు వద్దకు చేరుకున్నారని సమాచారం. ఒబామా భారత్ లోకి అడుగు పెట్టేందుకు ముందే ఉగ్రవాదులు దాడులకు పాల్పడాలని కుట్ర పన్నుతున్నారని నిఘావర్గాలు హెచ్చరించాయి.

దీనికి తోడు జైషే మహ్మమద్ ఉగ్రవాద సంస్థ కూడా దాడులకు తెగబడేందుకు ప్రణాళిక రచిస్తుందని నిఘావర్గాలు హెచ్చరించాయి. తమ సంస్థకు చెందిన ఉగ్రవాదులను కూడా సరిహద్దు దాటి భారత భూభాగంలోనికి చోచ్చుకెళ్లి దాడులకు పాల్పడాలని అదేశించినట్లు సమాచారం. నిఘావర్గాల హెచ్చరికలతో భారత్ పలు కీలక ప్రాంతాల్లో రెండెంచల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఒబామా పర్యటన ఖారారు అయినప్పటి నుంచే సరిహద్దు వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు. నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో భద్రతా దళాలు మరింత పకడ్భంధీ చర్యలకు ఉపక్రమించాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : LeT  barack Obama  Republic day celebrations  Narendra Modi  

Other Articles