Krishna district pamarru mla uppuleti kalpana daughter keerthi caught drunk n drive case

mla uppuleti kalpana news, krishna district pamarru mla uppuleti kalpana, mla uppuleti kalpana daughter keerthi, mla daughter caught drunk n drive, drunk n drive case, lady caught drunk n drive case, keerthi caught drunk n drive, police arrests mla daughter drunk n drive case

krishna district pamarru mla uppuleti kalpana daughter keerthi caught in drunk n drive case at hyderabad banjarahills

ITEMVIDEOS: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వైకాపా ఎమ్మెల్యే కూతురు...

Posted: 01/18/2015 11:03 AM IST
Krishna district pamarru mla uppuleti kalpana daughter keerthi caught drunk n drive case

నిన్నమొన్నటివరకు మందుబాబులే అనుకున్నాం.. ఇప్పుడు అమ్మాయిలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అడ్డంగా దొరికిపోతున్నారు. అదికూడా రాజకీయ లేదా ఇతర రంగాలకు చెందిన ప్రముఖుల కుటుంబానికి చెందినవాళ్లే! ఇతరుల వ్యవహారం కాస్త పక్కనపెడితే.. తాజాగా అందరు షాకయ్యేలా ఓ పరిణామం చోటు చేసుకుంది. తమ భవిష్యత్తును చక్కగా సరిదిద్దుతాడని ప్రజలు ఎంతో నమ్మకంగా ఓ రాజకీయ నాయకుడ్ని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే.. ఆయన కూతురు మాత్రం తమ కుటుంబ ప్రతిష్ట దిగజారియేలా ఈ ఘనకార్యం చేసింది.

హైదరాబాద్’లోని బంజారాహిల్స్ ప్రాంతంలో పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్’లో సుమారు 30 మంది మందుబాబులు అడ్డంగా బుక్కయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు తమ పనిని నిర్వహిస్తుండగా.. అటుగా వచ్చిన కారు ఒక్కసారిగా వెనక్కు తిరిగి వేగాన్ని పెంచుకుంటూ పారిపోసాగింది. దీంతో అనుమానం వచ్చిన ఖాకీలు వెంటనే ఆ కారును ఆపి, తమ విచారణను చేపట్టారు. అప్పుడు బయటపడింది అసలు విషయం.. ఆమె ఓ ఎమ్మెల్యే కూతురు అని!

కృష్ణాజిల్లా పామర్రు వైకాపా ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన కుమార్తె అయిన కీర్తి.. శనివారం రాత్రి తన స్నేహితులతో కలిసి పార్టీలో ఎంజాయ్ చేసింది. ఆ సందర్భంగానే ఆమె మద్యం సేవించింది. అనంతరం ఇంటికి బయలుదేరుతున్న సమయంలో పోలీసుల విచారణలో పట్టుబడింది. ఆమె అతిగా మద్యం సేవించి వుందని.. శరీరంలో 105 ఎంజీ బ్లడ్ ఆల్కహాల్ వుందని పోలీసులు తెలుపుతున్నారు. దీంతో ఆమె నడుపుతున్న ఏపీ 09 సీయూ 9029 వాహనాన్ని సీజ్ చేసి బుక్ చేసినట్లు వాళ్లు వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles