Heritage structures in hyderabad is in worst condition

Hyderabad, Hyderabad history, Hyderabad Heritage structures, Hyderabad Heritage, Heritage buildings in Hyderabad, Hyderabad tourism places, Hyderabad updates, World heritage places, heritage structures in India, telagana latest, Telangana news

Heritage structures in Hyderabad is in worst condition : Historical city hyderabad is place for many Heritage assets, but most of them are in worst condition because of the negligence of responsible autorities. Charminar, Errum Manzil, Sardar Mahal and many other Heritage structures are dying along the years

పాలకులారా.. మమ్మల్ని పట్టించుకొండి !

Posted: 01/13/2015 11:40 AM IST
Heritage structures in hyderabad is in worst condition

భాగ్యనగరం పేరుపొందిన హైదరాబాద్ ఎన్నో చారిత్రక కట్టడాలకు నెలవు. ప్రపంచస్థాయి చారిత్రక కట్టాలు ఎన్నో నగరంలో ఉన్నాయి. నగర వారసత్వానికి ఇవి నిలువుటద్దంగా నిలుస్తున్నాయి. చరిత్రకు ఆనవాళ్లుగా, భవిష్యత్ తరాలకు ఆస్తిగా ఉన్న ఈ చారిత్రక సంపదకు చెదలు పడుతోంది. వయసుపైబడిన ఎన్నో కట్టడాలు శిధిలావస్థకు చేరుకోగా.., మరెన్నో భూమిలో కలిసిపోయేందుకు సిద్దమవుతున్నాయి. ఒకప్పటి నగర దర్పానికి నిదర్శనంగా నిలిచిన వీటిని ప్రభుత్వాలు పట్టించుకోకపోవటంతో.. తమ చరిత్ర మట్టిగా సమాధి అవుతుందని మౌనంగా రోదిస్తున్నాయి.

చార్ మినార్, మక్కా మసీద్, ఫలక్ నమా ప్యాలెస్, ఎర్రమంజల్, సర్దార్ మహల్, కుతుబ్ షా టూంబ్స్ ఇలా చెప్పకుంటూ పోతే చారిత్రక సంపదకు లెక్కలేదు. అడుగడుగునా ఓ అద్బుత కట్టడం. ప్రతి ప్రాంతంలో ప్రత్యేక నిర్మాణాలు నగర కీర్తిని అంతకంతకూ పెంచేవే. ప్రపంచ వారసత్వ నగరాల్లో హైదరాబాద్ ను అగ్రపధాన నిలిపిన ఈ అద్బుతాలు పాలకుల నిర్లక్ష్యం వల్ల పాడైపోతున్నాయి. ‘‘ఏమని చెప్పను నా భాద.., ఎవరికి చెప్పను నా వ్యధ’’ అని తమలో తామే కుమిలిపోతున్నాయి. రాజులు పోయినా రాజ్యాలు పోయినా తమ కీర్తికి కొదువ లేదని మొదట్లో మురిసిపోయాయి. కాని కట్టడాల కలలు నెరవేరలేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా.., తమ దుస్థితి మాత్రం మారటం లేదని మనోవేదన చెందుతున్నాయి.

* సర్ధార్ మహల్ : నగరంలో ఉన్న చారిత్రక కట్టడాల్లో సర్ధార్ మహల్ కూడా ఒకటి. ఒకప్పటి హైదరాబాద్ స్టేట్ ను పాలించిన నిజాం నవాబుల్లో ఒకరైన ఆరవ నిజాం మహబూబ్ అలీ ఖాన్ తన భార్య సర్దార్ బేగం కోసం ఈ భవనాన్ని కట్టించారు. 1900 సంవత్సరంలో నిర్మించబడ్డ ఈ చారిత్రక కట్టడం ప్రస్తుత వయస్సు 115 సంవత్సరాలు. మహల్ ను చారిత్రక కట్టడంగా గుర్తించటంతో కాపాడుకునేందుకు చారత్రిక కట్టడాల కమిటీ నడుం బిగించింది. పగుళ్లు వచ్చిన గోడలు, ఇతర మరమ్మత్తుల కోసం రూ.2.2 కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వానికి నివేదిక అందించింది. కానీ ఇప్పటివరకు నయా పైస కూడ సర్కారు విడుదల చేయలేదు. అంతేకాదు మరొక విషయం ఏమిటంటే.., ఈ మహల్ ను మ్యూజియంగా మార్చాలని 2008 సంవత్సరంలో అధికారులు నిర్ణయించి సర్వే చేశారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పటివరకు తెలియదు.

* ఎర్రమంజిల్ : నిజాం కాలపు చారిత్రక కట్టడాల్లో ఎర్రమంజిల్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కోర్టులో ఉన్నత హోదాలో పనిచేసే ఫక్రూ ముల్క్ ఇక్కడ నివసించాడు. శిధిలావస్థకు చేరుకున్న ఈ భవనంను కూల్చేసి కొత్త భవనం కడుతున్నారు. కానీ ఈ నిర్మాణాలకు ప్రభుత్వ అనుమతి లేదని హెచ్.సీ.సీ. సభ్యులు ఆరోపిస్తున్నారు. కొందరు ప్రైవేటు వ్యక్తులు ఆదాయం కోసం అభివృద్ధి పేరుతో అక్రమ మార్గాలను ప్రయత్నిస్తున్నట్లు చెప్తున్నారు.

చారిత్రక కట్టడాలకు ప్రభుత్వ నిర్లక్ష్యం ఒకవైపు నష్టం కల్గిస్తుంటే మరోవైపు మెట్రో రైలు ఇబ్బందులు పెడుతోంది. మెట్రో మార్గం పేరుతో ఎన్నో చారిత్రక కట్టడాలను నామరూపాల్లేకుండా కూల్చేస్తున్నారు. ప్రాజెక్టు ప్రారంభంలో అయితే ఎన్నో కట్టడాలను కూల్చేయాలని అప్పటి ప్రభుత్వం టార్గెట్ చేసింది. అయితే వారసత్వ సంపద ప్రేమికులు, ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో కాస్త వెనక్కి తగ్గింది. ప్రస్తుతం ఉన్న తెలంగాణ ప్రభుత్వం కట్టడాలకు ఏ మాత్రం హాని కలగవద్దు అని భావించి మెట్రో అలైన్ మెంట్ మారుస్తోంది. కానీ కొత్త మార్గంలోనూ కొన్ని చారిత్రక కట్టడాలున్నట్లు స్పష్టం అవుతోంది.

చారిత్రక కట్టడాలు అంటే పాత గోడలు కాదు కూల్చేయటానికి..
పనికిరాని భవనాలు కాదు నిర్లక్ష్యం చేయటానికి..
వారసత్వ సంపద నగరానికి ఒక వాణిజ్య వనరు
ఆస్తిని పెంచమనటం లేదు.. కాపాడుకుంటే చాలు

ముచ్చటపడి కట్టుకున్న మన ఇంటిని కూల్చేస్తే ఎంత భాధఉంటుంది. వారసత్వ కట్టడాలు కూల్చేస్తుంటే కూడా అవి అంతే బాదపడుతాయి. ఏముందిలే పాత గోడలే కదా, ఎందుకు పనికివస్తాయి అని కొందరు చెప్పవచ్చు. కాని పాతగోడల వెనక ఎన్నో నిజాలు దాగి ఉంటాయి. ఎన్నో మరుపురాని ఘట్టాలకు ఇవి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయి. అలాంటి కట్టడాలను కూల్చేయటం అంటే చరిత్ర సాక్ష్యాలను చెరిపివేయటమే. పాలకులారా ఇకనైనా మేల్కొనండి. చారిత్రక సంపదను కాస్త పట్టించుకొండి. స్కైవేలు, మల్టీ ప్లెక్ల్సులేవీ చరిత్రకు సాటిరావు. ఈ విషయం గుర్తించి పాత గోడలను పట్టించుకొండి.., హైదరాబాద్ చరిత్రను కాపాడండి.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  Heritage structures  Telangana news  

Other Articles