Supreme court judgement not in favour of cock fight

supreme court green signal to cock fight, supreme court green signal to sankranthi bird fight, Supreme court verdict on cock fight, supreme court permitted cock fights, supreme court, cock fight, sankranti cock fights in AP, BJP leader Raghuram Krishnam raju, green signal, east godavari police,

The Supreme Court of India on Monday has not permitted for conduct of Cockfights in Andhra Pradesh. The Court dealing with a petition has stayed as it is position untill high court verdict says east godavari police officials

సుప్రీం స్టే.. అవిరైన పందెంరాయుళ్ల ఆశలు..

Posted: 01/12/2015 08:04 PM IST
Supreme court judgement not in favour of cock fight

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తాజాగా ఇవాళ ఇచ్చిన తీర్పు కోడి పందాలకు అనుకూలమని ఓ వైపు కోడి పందాల రాయుళ్లు సంబరాల్లో మునిగిపోతుండగా, న్యాయస్థానం తీర్పు అనుకూలం కాదని పోలీసులు స్పష్టతను ఇవ్వడంతో పందెం రాయుళ్ల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లైంది. దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో సంబరాలకు పోలీసుల అడ్డు వుండదని పందం రాయుళ్లలో వెల్లివిసిరిన ఆనందం.. గంటలలోపు వ్యవధిలోనే అవిరైంది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు కోడి పందాలకు అనుకూలంగా లేదని పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు స్పష్టం చేశారు.

సుప్రీం తీర్పులో యథాస్థితిని కొనసాగించడమంటే చట్టాలను అమలు చేయడమేనని పేర్కొన్నారు. ఈ కేసును హైకోర్టు పునర్విచారణ చేసిన అనంతరం ఇచ్చే ఆదేశాలను తప్పక పాటిస్తామన్నారు. కోడి పందాల సమస్యను పరిష్కరించాలని హైకోర్టును దేశ అత్యున్నత ధర్మాసనం ఆదేశించిన నేపథ్యంలో సంబరంగా పండగను జరుపుకుంటామన్న పందెం రాయుళ్ల ఆశలు అంతలోనే అవిరయ్యాయి. కోడి పందాలు నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చడమే కాకుండా.. ఆ సమస్యను పరిష్కారించాలని హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. అప్పటివరకూ యథాతథ స్థితి కొనసాగుతుందని సుప్రీం స్పష్టం చేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cock fights  supreme court  andhra pradesh police  sankranthi  green signal  

Other Articles