Psycho arrested in siddipet

psycho arrested in siddipet, psycho arrested in medak, psycho arrested in telangana, psycho forced girl to love him, psycho to set ablaze his lover, crime against women, voilence against women,

psycho who was to set ablaze his lover for forcing to love him is arrested in siddipet

ప్రేమించిన యువతి కాదందని.. ఇలా చేస్తారా.?

Posted: 01/11/2015 06:13 PM IST
Psycho arrested in siddipet

తాను మనసారా ప్రేమించాడు. సరే. తన ప్రేమను అమోదించమంటే అదేం న్యాయం. తాను ఇష్టపడ్డ యువతి కూడా ఇష్టపడితే సరే.. కానీ ఇష్టపడాల్సిందేనంటూ ఆదేశిస్తే.. తాజాగా విడుదలవుతున్న సినిమాల ప్రభావం యువతపై అధికంగా పడి.. వారిని నేర ప్రవృత్తి వైపు ప్రయాణించేలా చేస్తున్నాయి. సినిమాలకు తోడు సీరియళ్లు నేర ప్రవృత్తిని పెంచి పోషించడంతో యువత నేరమార్గాన్నే ఎంచుకుంటుంది. అటుగానే ప్రయాణిస్తుంది.

తాజాగా తెలంగాణలోని మెదక్ జిల్లాలో యువతలో నేర ప్రవృత్తికి నిదర్శనంగా నిలుస్తుంది. తనను ప్రేమించాలంటూ ఓ యువతిపై ప్రేమోన్మాది ఒత్తడి తీసుకోస్తున్నాడు. గత కొన్నాళ్లుగా వాడి బెదిరింపులు సాగుతున్నా యువతి పట్టించుకోలేదు. దీంతో యువతిని ఎలాగైనా ఒప్పించాలని సదరు ప్రేమోన్మాది యువతిపై కిరోసిన్ పోసి నిప్పుంటించేందు ప్రయత్నించాడు.

అక్కడే ఉన్న స్థానికులు ఆ ప్రేమోన్మాది ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అనంతరం అతడికి దేహశుద్ధి చేసి.. పోలీసులకు అప్పగించారు. అతడిని పోలీసు స్టేషన్కు తరలించి... కేసు నమోదు చేసి... తమదైన శైలిలో విచారిస్తున్నారు. ఈ ఘటన ఆదివారం మెదక్ జిల్లా సిద్దిపేటలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... స్థానిక కళాశాలలో చదువుతున్న ఓ యువతిని ప్రేమిస్తున్నాంటూ ఓ యువకుడు రోజూ వెంట పడి వేధిస్తున్నాడు. అందుకు ఆమె ససేమిరా అంది. దాంతో ఆమెపై ఆగ్రహంతో ఉన్న సదరు యువకుడు ఉన్మాదిగా మారి ఆదివారం యువతిపై కిరోసిన్ పోసి సజీవ దహనానికి యత్నించాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : psycho  arrested  siddipet  medak  telagana  

Other Articles