Mba graduate arrested for murdering his lover

mba graduate arrested for his lover murder, mysuru murder case, young girls lover arrested, west mysuru RT colony, mba gratuate arrest, mba graduate murdered lover, three-week-old gruesome murder, cctv footage, accused arrested, 20-year-old woman murder, women dead body in manhole, mysuru district police,

Five empty wine bottles at a murder spot, CCTV footage of a car heading towards the site, and call record details led Mysuru district police to uncover a three-week-old gruesome murder of a 20-year-old woman.

ప్రేమించాడు.. వదిలించుకునేందుకు ఇలా చేశాడు

Posted: 01/10/2015 12:03 PM IST
Mba graduate arrested for murdering his lover

చాలా మంది యువకుల్లో జరిగిదే ఇక్కడ అతని హృదయంలోనూ జరిగింది. ఓ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. వలచాడు. అంతా నువ్వేనని నమ్మించాడు. ప్రేమించాడు. ఎలాగోల అమ్మాయి కూడా అతడిని నమ్మింది.. సర్వస్వం అర్పించింది. అవసరం తీరిని తరువాత గోముఖవ్యాఘ్రమంలా తయారైయాడు ప్రేమికుడు. మరేం మయాదారి రోగం వచ్చిందో కానీ ఇష్టపడి వలచిన చిన్నదానిని వదిలించుకునేందుకు ఇలా చేసి.. అలా చిక్కాడు.

తానోక ఎంబీఏ గ్రాడ్యుయేట్‌.. అ విషయాన్ని మర్చిపోయి.. తాను ప్రేమించిన ప్రియురాలిని వదిలించుకునేందుకు ఏకంగా హత్యచేసి మ్యాన్ హోల్ లో దాచాడు. మూడు వారాల క్రితం జరిగిన ఈ హత్యకేసును కర్ణాటక రాష్ట్రం మైసూరు జిల్లా పోలీసులు చేధించారు. హత్యజరిగిన స్థలంలో లభించిన ఐదు ఖాళీ మద్యం సీసాలు, సిసిటివీ ఫుటేజీ, కాల్ రికార్డు వివరాలు 20 ఏళ్ల హత్య కేసును ఛేదించేందుకు ఉపయోగపడ్డాయి.

తన ప్రేయసిని చంపినందుకు అతని సొంత పట్టణంలో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. మహిళ సగం కాలిన మృతదేహం డిసెంబర్ 22వ తేదీన పశ్చిమ మైసూరులోని ఆర్టీ నగర్‌లో మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ మ్యాన్‌హోల్‌లో కనిపించింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్గం నిమిత్తం పంపించరు. మహిళపై దాడి చేసి, ఆమెను చంపి, శవాన్ని కాల్చి మ్యాన్‌హోల్‌లో పడేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఘటనాస్థంలో లభించిన ఖాళీ మద్యం సీసాలు, కాల్ వివరాల ఆధారంగా చామరాజ్‌నగర్ జిల్లాలోని కొల్లెగల్ తాలూకా దొడ్డహిందువాడిలో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు బాటిల్స్‌ను స్వాధీనం చేసుకుని వాటిపై లేబుల్స్ ఆధారంగా వాటిని విక్రయించిన దుకాణాన్ని కనిపెట్టి ఆరా తీశారు. ఆ బాటిల్స్‌ను కొన్న వ్యక్తిని గుర్తించడానికి సిసిటీవీ ఫుటేజీలను పరిశీలించారు. చిత్రం దొరిగినప్పటికీ అతను ఎవరనేది గుర్తించడం పోలీసులకు కష్టంగానే మారింది.

కాగా నేరం జరిగిన స్థలానికి 21,22 మధ్య రాత్రి వెళ్తున్న కారు ఫుటేజీ పోలీసులకు చిక్కింది. ఓ ప్రైవేట్ నివాసం వద్ద అమర్చిన ఉన్న సిసిటీవీ కెమెరా ఫుటేజీ దాన్ని పట్టించింది. ఈ ఇమేజ్ స్పష్టంగా లేనప్పటికీ నేరం జరిగిన తీరును మాత్రం పట్టిచ్చింది. ఆ తర్వాత దాదాపు 200 మొబైళ్ల నుంచి 20-25 మొబైల్ నెంబర్లను షార్ట్ లిస్ట్ చేసి నిందితుడిని గుర్తించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : karnataka  west mysuru  lady murder  manhole  RT colony  

Other Articles