Kcr warangal tour update

Kcr Warangal tour, Kcr Warangal tour updates, Kcr Warangal tour latest, kcr latest updates, telangana updates, kcr, kcr latest comments, kcr promises, kcr election promises, telangana latest news, Andhra Pradesh updates

kcr warangal tour update : telangana chief minister KCR continues warangal tour on third day, he promises people of warangal that he wiil not leave city till problems solved. officials of warangal are working hard to satisfy kcr and public, all become alerted with kcr four days tour

ఒకే ఒక్కడితో వణుకుతున్న వరంగల్

Posted: 01/10/2015 10:49 AM IST
Kcr warangal tour update

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనతో వరంగల్ అధికారుల్లో గుబులు పుడుతోంది. సీఎం వచ్చినా ఒక్కరోజు ఉంటాడులే ఆ రోజు కాస్త హడావుడిగా పనిచేస్తే సరి అనుకున్న అధికారులకు కంటిమీద కునుకు కూడా ఉండటం లేదు. కేసీఆర్ ప్లాన్  మార్చుకుని రెండ్రోజలు పాటు వరంగల్ లో ఉన్నాడు. అంతటితో ఆగలేదు. మరో రెండ్రోజులు అంటే.. ఇవాళ, రేపు  కూడా వరంగల్ లోనే ఉంటాడట. ఒక్కరోజు ఉంటాడనుకున్న సీఎం, నాలుగు రోజుల పాటు వరంగల్ లో తిష్ట వేయటంతో.., అధికారులు హడావుడి పడుతున్నారు.

ప్రతి గల్లీకి, మురికివాడలకు వెళ్ళి స్వయంగా సమస్యలు తెలుసుకుంటూ, అధికారులను అక్కడికక్కడే నిలదిస్తుండటంతో ఎప్పుడు ఎవరిపై పిడుగు పడుతుందో అని భయంతో వణికిపోతున్నారు. ‘ఒకే ఒక్కడు’ సినిమాలో అర్జున్ లా.., స్వయంగా ప్రజల దగ్గరకు వెళ్లి సమస్యలు తెలుసుకుని అక్కడే అధికారులను నిలదీస్తున్నాడు. ఏ మాత్రం తేడా వచ్చినా నడి రోడ్డుపై సస్పెన్షన్ ఆర్డర్ చేతికి వస్తుందని ఒళ్లు దగ్గర పెట్టుకుని అధికారులు పని చేస్తున్నారు. అయితే కేసీఆర్ పర్యటనతో వరంగల్ ప్రజలు, ముఖ్యంగా మురికివాడల్లో నివసించే వారు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నడూ రాని ఆఫీసర్లు కేసీఆర్ పర్యటనతో ఇంటి ముందుకు వచ్చి సమస్యలు తెలుసుకుంటున్నారని సంతోషపడుతున్నారు. కానీ ఇది మూణ్ణాళ్ళ ముచ్చటే అని వారికి తెలియటం లేదు.

ఇంతకీ కేసీఆర్ వరంగల్ పై ఇంత ప్రేమ పెంచుకోవటానికి కారణం ఏమిటా అని రాజకీయ విశ్లేషకులు, ప్రతిపక్షాలు తెగ ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పట్లో మున్సిపల్ ఎన్నికలు లేవు, జిల్లాలో పార్టీ పరిస్థితి కూడా బాగానే ఉంది. ఇలాంటి తరుణంలో వరంగల్ కోసం నాలుగు రోజులు కేటాయించటం వెనక మతలబు ఏమిటా అని ఆరా తీస్తున్నారు. ప్రజలను పట్టించుకోవటం లేదని ప్రభుత్వంపై వస్తున్న విమర్శలు తిప్పి కొట్టేందుకు సీఎం సార్ ఇలా వరంగల్ లో పర్యటించి ప్రతిపక్షాలకు సమాధానం చెప్తున్నారని.., అదేవిధంగా అధికారుల్లో కూడా ఒక రకమైన భయం కల్గించేలా ఈ టూర్ ను ఉపయోగించుకుంటున్నారని కొందరు చెప్తున్నారు. కారణం ఏదయితేనేం.., ఎవరి మాటా వినని సీఎం, మూడవ రోజు మురికివాడల్లో పర్యటిస్తూ పేదల మనిషి అన్పించుకుంటున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kcr tour  telangana  warangal  

Other Articles